పుష్ప 2 నుండి అతనిని తీసేయాలి అంటూ అభిమానుల రచ్చ

* పుష్ప 2 నుండి అతనిని తీసేయాలి అంటూ అభిమానుల రచ్చ

Rama Rao
Updated on: 6 July 2022 10:30 AM IST
Fans Demand that Technician Should Be Removed from Pushpa 2 Movie
X

పుష్ప 2 నుండి అతనిని తీసేయాలి అంటూ అభిమానుల రచ్చ

Pushpa 2: "స్లమ్ డాగ్ మిలియనియర్" సినిమాకి గాను బెస్ట్ సౌండ్ ఇంజనీర్ గా ఆస్కార్ అవార్డు కూడా గెలుచుకున్న రసూల్ పోకుట్టీ ఈ మధ్యనే ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో నటించిన "ఆర్ఆర్ఆర్" సినిమాపై షాకింగ్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. సినిమా గురించి మాట్లాడుతూ "ఆర్ ఆర్ ఆర్" సినిమా ఒక గే లవ్ స్టోరీ గా ఉంది అని అనటం అభిమానుల మనోభావాలను బాగా దెబ్బతీసింది.

అప్పటినుంచి రసూల్ పోకుట్టి పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. రసూల్ పై ప్రేక్షకులు మండిపడుతున్నారు. అయితే రసూల్ మాత్రం ఇందులో తన తప్పేమీ లేదని వెస్ట్రన్ దేశాల్లో ఈ సినిమా గురించి అలానే మాట్లాడుకుంటున్నారు అంటూ వాళ్ల మీద తోసేశారు. ఈ నేపథ్యంలో రసూల్ లాంటి వ్యక్తికి అసలు టాలీవుడ్ లో అవకాశాలు రాకూడదు అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.

ప్రస్తుతం రసూల్ తెలుగులో పుష్ప 2 సినిమా కి పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పుష్ప 2 నుంచి రసూల్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసేయాలి అంటూ రచ్చ చేస్తున్నారు. టాలీవుడ్ మరియు తెలుగు సినిమాపై ఏమాత్రం గౌరవం ఉన్న రసూల్ ని ఏ ప్రాజెక్టులోకి తీసుకోకూడదు అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. మరి పుష్ప నుండి రసూల్ ను తీసేసారా అని ఇంకా తెలియాల్సి ఉంది.

Rama Rao

Rama Rao

Next Story