జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్ హంగామా

జూనియర్ ఎన్టీఆర్ ఇంటి దగ్గరకు భారీగా తరలివచ్చిన అభిమానులు

Rama Rao
Published on: 20 May 2022 10:01 AM IST
Fans Cut the Cake in Front of the NTR House at Midnight
X

జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్ హంగామా

Jr NTR Fans: జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఇవాళ. దీంతో ఆయన అభిమానులు హల్ చల్ చేశారు. ఈసందర్భంగా తమ అభిమాన హీరో, యంగ్ టైగర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు హైదరాబాద్ తరలివచ్చారు. దీంతో ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఆయన ఇంటి దగ్గర హడావుడి చేశారు. ఎన్టీఆర్ ఇంటికి భారీగా అభిమానులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది.

అయితే ఎన్టీఆర్ ఇంటి ముందే కేక్‌ కట్‌ చేసే సమయంలో అభిమానుల మధ్య చిన్నపాటి గొడవ చోటు చేసుకుంది. ఫ్యాన్స్ అల్లరి శ్రుతి మించడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి అభిమానులను చెదరగొట్టారు. అయితే అర్థరాత్రే కొందరు అభిమానులు తారక్ ఇంటివద్దకు చేరుకొని బాణాసంచా కాల్చి హడావుడి చేశారు. మాస్ హీరో మాస్ ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్స్ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హడావుడి చేస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story