Kadapa: ట్రిపుల్ ఆర్ ట్రైలర్ పై అంబరాన్నంటిన ఫ్యాన్స్ సంబరాలు

Kadapa: ట్రిపుల్ ఆర్ సినిమా ట్రైలర్ విడుదల సంధర్భంగా ఫాన్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి

Arun Chilukuri
Updated on: 9 Dec 2021 6:33 PM IST
Fans Celebrating the RRR Movie Trailer in Kadapa
X

 ట్రిపుల్ ఆర్ సినిమా ట్రైలర్ చూసి సంబర పడుతున్న ఫ్యాన్స్

Kadapa: ట్రిపుల్ ఆర్ సినిమా ట్రైలర్ విడుదల సంధర్భంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి. కడప నగరంలోని అప్సర థియేటర్ నందు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు సుధాకర్ అధ్వర్యంలో కేక్ కట్ చేసి డప్పులు కొట్టుకుంటూ డ్యాన్స్ లు వేస్తూ ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు. ట్రైలర్ చూసిన తర్వాత ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇద్దరు అగ్రహీరోలు ఒకే సినిమా లో నటించడం మహా అద్భుతంగా ఉందని ఇద్దరి నటన మాటల్లో చెప్పలేకున్నామని, ట్రైలర్ కే పండుగ వాతావరణం వచ్చిందన్నారు. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వన వచ్చే ఈ సినిమా మళ్ళీ బాక్స్ ఆఫీస్ లను బద్దలు చేస్తుందన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story