HBD Balakrishna: బాలయ్య బర్త్‌డే పై అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి!

HBD Balakrishna: బాలయ్య బాబు పుట్టినరోజు కోసం నందమూరి ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

Venkata Chari
Updated on: 8 Jun 2021 9:45 PM IST
‌Fans Awaiting for BalaKrishna Birth day
X

బాలకృష్ణ (ఫొటో ట్విట్టర్)

HBD Balakrishna: బాలయ్య బాబు పుట్టినరోజు కోసం నందమూరి ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 10న బాలకృష్ణ పుట్టిన రోజు నాడు.. కొత్త సినిమాల అప్‌డేట్స్‌ వస్తుందని వాళ్లు భావిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఇప్పటి నుంచే హంగామా చేస్తున్నారు.

అయితే, బాలయ్య బాబు తన తదుపరి సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా, ఈ సినిమా కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారం చేసుకుని ఈ కథను సిద్ధం చేసినట్లు దర్శకుడు పేర్కొన్నాడు. ఈ మేరకు అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నెల 10న ఈ సినిమాను ప్రకటించి ఫస్ట‌లుక్‌ను విడుదల చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

అలాగే అనిల్ రావిపూడితో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. అలాగే తాజాగా బాలకృష్ణ నటిస్తోన్న 'అఖండ' సినిమా దాదాపు పూర్తి కావొస్తోంది. దీనికి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. బోయపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దసరాకి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Venkata Chari

Venkata Chari

Next Story