అక్కినేని కుటుంబానికి బాలయ్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న ఫ్యాన్స్

Fans are Demanding Balakrishna Apology to Akkineni Family
x

అక్కినేని కుటుంబానికి బాలయ్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న ఫ్యాన్స్

Highlights

Balakrishna: బాలకృష్ణ కి వ్యతిరేకంగా నినాదాలు మొదలుపెట్టిన అక్కినేని అభిమానులు

Balakrishna: తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన "వీర సింహారెడ్డి" సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహించింది చిత్రబృందం. అయితే ఈ వేడుకలో మాట్లాడుతూ అక్కినేని కుటుంబం గురించి నందమూరి బాలకృష్ణ నోరు జారిన సంగతి తెలిసిందే. సినిమా సెట్స్ లో చిత్ర నిర్మాత తో బోలెడు విషయాలు మాట్లాడుకున్నామని, చెబుతూ అలనాటి లెజెండరీ నటుల గురించి మాట్లాడుతూ అక్కినేని తొక్కినేని అని అన్నారు.

అప్పటినుంచి అక్కినేని అభిమానులు బాలకృష్ణపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా అక్కినేని నాగచైతన్య మరియు అఖిల్ కూడా ఈ విషయమై రియాక్ట్ అయ్యారు. దీంతో బాలకృష్ణ వ్యాఖ్యలకు అక్కినేని కుటుంబం కూడా హర్ట్ అయినట్లు చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో నర్తకి సెంటర్లో అక్కినేని అభిమానులు బాలకృష్ణకి వ్యతిరేకంగా నినాదాలు చేయటం మొదలుపెట్టారు.

బాలయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కినేని కుటుంబానికి క్షమాపణలు చెప్పి తీరాలని పేర్కొన్నారు. నందమూరి కుటుంబం ఎప్పటినుంచో అక్కినేని కుటుంబాన్ని టార్గెట్ చేస్తోందని, అప్పట్లో ఎన్టీఆర్ తో కలిసి రాజకీయాల్లోకి రావడానికి నాగేశ్వరరావు నిరాకరించడంతో ఈ రెండు కుటుంబాలకి మధ్య వైరం ఏర్పడిందని అభిమానులు అంటున్నారు. చూస్తూ ఉంటే ఈ వివాదం రోజు రోజుకి పెద్దదయ్యే లాగా కనిపిస్తోంది. మరి ఇప్పటికైనా బాలకృష్ణ ముందుకు వచ్చి అక్కినేని కుటుంబాన్ని శాంతపరుస్తారో లేదో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories