వంశీ పైడిపల్లి పై విమర్శల వర్షం కురిపిస్తున్న అభిమానులు

* వారసుడు ట్రైలర్ చూశాక వంశీ పైడిపల్లి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

Dhatripriya
Updated on: 6 Jan 2023 9:30 PM IST
Fans Are Criticizing Vamsi Paidipally
X

వంశీ పైడిపల్లి పై విమర్శల వర్షం కురిపిస్తున్న అభిమానులు

Vamshi Paidipally: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న మొట్టమొదటి డైరెక్ట్ తెలుగు సినిమాగా "వారసుడు" త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. వాల్తేరు వీరయ్య మరియు వీరసింహారెడ్డి సినిమాలకు పోటీగా ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలోనే దిగనుంది. అయితే తాజాగా ఈ మధ్యనే ట్రైలర్ విడుదల చేసింది ఈ చిత్ర బృందం. ట్రైలర్ చూశాక సినిమాపై అంచనాలు పెరుగుతాయి అనుకుంటే అభిమానులు సైతం డైరెక్టర్ వంశీ పైడిపల్లి ని తిట్టి పోస్తున్నారు.

చాలా సినిమాల తో కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ కూడా మొదలు పెట్టేసారు. సినిమాలో కొత్తదనం ఏమీ లేదని ఎన్నో సూపర్ హిట్ తెలుగు సినిమాలను కాపీ కొట్టి వంశీ పైడిపల్లి ఈ కథ రాసినట్టున్నారు అని నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, మహేష్ బాబు మహర్షి, శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, గౌతమ్ ఎస్ఎస్సి, అలవైకుంటపురంలో, ఇలా ఎన్నో సినిమాల నుండి షాట్స్ ఈ సినిమాలో కూడా ఉన్నాయని అంటున్నారు. ఒక ధనిక కుటుంబం పెద్ద ఇల్లు కార్పొరేట్ సెటప్ ఇలాంటి డాక్టర్ ఆఫ్ ఎన్నో తెలుగు సినిమాల్లో వచ్చిందని ఇందులో ఏమాత్రం కొత్తదనం లేదని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.

ఇలాంటి కథను మహేష్ బాబు రిజెక్ట్ చేసినందుకు ఫ్యాన్స్ హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ట్రైలర్ చూసి మెగా మరియు నందమూరి అభిమానులు సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో ముందుగానే ఊహించి ఆనందపడుతున్నారు. సంక్రాంతి బరిలోనే విడుదల కాబోతున్న వాల్తేరు వీరయ్య మరియు వీరసింహారెడ్డి సినిమాలకు ఏమాత్రం డోకా లేదని చెబుతున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story