"వాల్తేరు వీరయ్య" పాటపై విమర్శల వర్షం కురిపిస్తున్న ఫ్యాన్స్

Fans are Criticizing the Song Waltair Veerayya
x

 "వాల్తేరు వీరయ్య" పాటపై విమర్శల వర్షం కురిపిస్తున్న ఫ్యాన్స్

Highlights

Waltair Veerayya: పేరులో ఉన్న పూనకాలు పాటలో లేవని డీలా పడిపోయిన అభిమానులు

Waltair Veerayya: ఈ మధ్యనే "ఆచార్య" సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి "గాడ్ ఫాదర్" సినిమాతో పర్వాలేదు అనిపించారు. తాజాగా ఇప్పుడు చిరంజీవి "వెంకీ మామ" ఫేమ్ డైరెక్టర్ కె ఎస్ రవీంద్ర అలియాస్ బాబి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా తో బిజీగా ఉన్నారు. "వాల్తేరు వీరయ్య" అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమా లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.

వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. చిరంజీవి మరియు రవితేజల మధ్య సినిమాలో ఒక పాట కూడా ఉండబోతోంది. ఈ పాటకి దేవిశ్రీ ఎలాంటి సంగీతం అందించారు అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. వారి ఎదురు చూపులకు చెక్ పెడుతూ చిత్ర బృందం మూడు నిమిషాల సుదీర్ఘ మ్యూజిక్ బిట్ ను విడుదల చేసింది. "డోన్ట్ స్టాప్ డాన్సింగ్… పూన‌కాలు లోడింగ్" అంటూ ఒక చిన్న రాప్ తప్ప పాటలు ఇంకేమీ లేదు. ముందు నుంచి ఈ పాటపై అంచనాలు కూడా ఎక్కువగా ఉండటంతో పాట విషయంలో అభిమానులు డీలా పడిపోయారు.

ఒక చిన్న మ్యూజిక్ బిట్ ని పాట అంటూ విడుదల చేయటం తప్పని అభిమానులు నిందలు వేస్తున్నారు. ఇంతకుముందు రవితేజ నటించిన "ధమాకా" సినిమాలో పల్సర్ బైకు పాట ఉందని చెప్పలేదు. థియేటర్లో మాత్రమే రివీల్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. పూనకాల పాట విషయంలో కూడా అదే చేసి ఉంటే అభిమానులు సైతం పాటను యాక్సెప్ట్ చేసే వాళ్లేమో కానీ ఇలా చేయటంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. నిజానికి సినిమాలో రవితేజ మరియు చిరంజీవిల మధ్య పాట పెట్టే సిచువేషన్ కూడా ఉండదట. అందుకే ఇలాంటి మ్యూజిక్ బిట్టుతో సరిపెట్టాల్చి వచ్చిందని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories