Valimai Movie: అజిత్ సినిమాపై అభిమానుల ఆగ్రహం

Valimai Movie: కనీసం టైటిల్ కూడా మార్చలేరా అంటూ ప్రశ్నిస్తున్న అభిమానులు

admin1
Updated on: 5 Jan 2022 6:00 PM IST
Fans are Angry over the Title of the  Ajiths Telugu Movie Valimai
X

అజిత్ సినిమాపై అభిమానుల ఆగ్రహం

Valimai Movie: టాలీవుడ్ లో స్టార్ హీరో అయిన అజిత్ కి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళ్ లో అజిత్ సూపర్ హిట్ సినిమాలు అన్ని తెలుగులో కూడా విడుదలయ్యాయి. అయితే తాజాగా అజిత్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తమిళ సినిమా "వాలిమై". ఇప్పుడు ఈ సినిమాని కూడా తెలుగులో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. కానీ ఈ సినిమాకి కూడా తమిళ్ టైటిల్ ని వాడటం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఈ మధ్యనే విడుదలైన పోస్టర్లో తెలుగు టైటిల్ "వలీమై" అని ఉండటం చూసి అభిమానులు సైతం దర్శక నిర్మాతలపై దుమ్మెత్తిపోస్తున్నారు.

సినిమాని తెలుగులోకి అనువదిస్తున్నప్పుడు కనీసం తెలుగు టైటిల్ కూడా పెట్టుకోలేని దౌర్భాగ్య స్థితికి రావటం చాలా దారుణం. "వాలిమై" అంటే తెలుగులో బలం అని అర్థం వస్తుంది. అంతకుముందు బలం నే టైటిల్ గా ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు "వలీమై" అనే టైటిల్ పెట్టి అధికారికంగా పోస్టర్లు వదిలారు దర్శకనిర్మాతలు. ఈ సినిమా జనవరి 13న విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. మరి తెలుగు ప్రేక్షకులకు అర్థం కాకుండా తమిళ టైటిల్ ని పెట్టుకొని తెలుగులో సినిమా రిలీజ్ చేయడం ఏంటని అందరూ కామెంట్లు చేస్తున్నారు. కనీసం సినిమాలో హీరో పేరు కూడా అది కాదు

admin1

admin1

Next Story