Puri Jagannadh: పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమా ఎవరితో?

Puri Jagannadh: పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమా గురించి సలహా ఇస్తున్న అభిమానులు

Jyothi
Published on: 19 Oct 2022 10:46 AM IST
Fans Advising about Puri Jagannadh Next Movie
X

Puri Jagannadh: పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమా ఎవరితో?

Puri Jagannadh: డైనమిక్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ ఈ మధ్యనే "ఇస్మార్ట్ శంకర్" సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. కానీ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన "లైగర్" సినిమాతో మాత్రం మర్చిపోలేని డిజాస్టర్ ను అందుకున్నారు. "ఇస్మార్ట్ శంకర్" తర్వాత పూరితో సినిమా చేయాలని వెనకాల పడ్డ హీరోలు కూడా ఇప్పుడు "లైగర్" తర్వాత మొహం చాటేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారీ అంచనాల మధ్య విడుదలైన "లైగర్" పెద్ద డిజాస్టర్ గా నిలవడంతో పూరిపై ఎక్కడలేని నెగిటివిటీ కమ్ముకుంది. ఒక్కసారిగా సోషల్ మీడియాలో పూరి జగన్నాథ్ పై ఎక్కడలేని ట్రోలింగ్ మొదలైంది.

ఇక "లైగర్" డిజాస్టర్ అవడంతో పూరి - విజయ్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రావలసిన "జనగణమన" సినిమా కూడా క్యాన్సిల్ అయింది. ఇక పూరి జగన్నాథ్ తదుపరి సినిమా ఏంటి అని ఇంకా తెలియాల్సి ఉంది. బాలకృష్ణ లేదా హీరో రామ్ తో పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. మరోవైపు పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమా కోసం ఒక యంగ్ హీరోని ట్రై చేస్తేనే బాగుంటుంది అని కామెంట్లు వినిపిస్తున్నాయి. విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, నాగ చైతన్య, అఖిల్ వంటి యువ హీరోలతో సినిమా చేస్తే పూరీ జగన్నాథ్ కు ఉపయోగపడే అవకాశం ఎక్కువగా ఉందని అభిమానులు సలహాలు ఇస్తున్నారు. మరి పూరి వారి సలహాలు ఎంతవరకు వింటారో తెలియాల్సి చూడాలి.

Jyothi

Jyothi

Next Story