రామ్ చరణ్‌పై అభిమానం చాటుకున్న జయరాజ్.. అర ఎకరం పొలంలో ముఖ చిత్రం...

Fan Jayaraj Created Ram Charan Face with Paddy in Jogulamba Gadwal | Live News
x

రామ్ చరణ్‌పై అభిమానం చాటుకున్న జయరాజ్.. అర ఎకరం పొలంలో ముఖ చిత్రం...

Highlights

Ram Charan - Fan: అర ఎకరం పొలంలో రామ్ చరణ్ ముఖ చిత్రం...

Ram Charan - Fan: తమ అభిమాన నటీనటుల కోసం ఫ్యాన్ ఏదైనా చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా రామ్ చరణ్ జన్మదిన కానుకగా అర ఎకరంలో వరి నాటుతో చరణ్ ముఖ చిత్రాన్ని తయారు చేయించాడు జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఆరగిద్ద గ్రామానికి చెందిన జయరాజ్. పచ్చని పంట పొలాల మద్య వేసిన ఈ చిత్రం చూపరులకు కనువిందు చేస్తుంది.

45 రోజుల క్రితం అర ఎకరం పొలాన్ని లీజుకు తీసుకొని వరినాటుతో రామ్ చరణ్ ముఖ చిత్రం తయారు చేసినట్లు జయరాజ్ తెలిపాడు. ఎంతో జాగ్రత్తగా కష్టపడి ఆ చిత్రాన్ని కాపాడుకున్నామని ఎప్పటికప్పుడు ఎరువులు, లేజర్ వేస్తూ ఇంతవరకు తెచ్చామన్నారు. ఈనెల 27న రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా శిల్పకళావేదికలో దీన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories