Actor Vivek: ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత

Actor Vivek: ప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్(59) కన్నుమూశారు.

Kranthi
Updated on: 17 April 2021 7:13 AM IST
Famous Tamil Comedian Vivek Died
X

Actor Vivek:(File Image)

Actor Vivek: ప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్(59) కన్నుమూశారు. చెన్నైలోని సిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతిచెందారు. నిన్న ఉదయం 11 గంటలకు వివేక్‌ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. వివేక్‌ దాదాపు 300కి పైగా చిత్రాల్లో నటించారు. దర్శక శిఖరం కె. బాలచందర్‌ పరిచయం చేసిన నటుల్లో వివేక్‌ ఒకరు. 'మనదిల్‌ ఉరుది వేండం' సినిమా ద్వారా ఈయన సినీ అరంగేట్రం చేశారు. దాదాపు పెద్ద హీరోలందరితో కలిసి నటించారు. రజనీకాంత్‌, కమల్‌హాసన్, విజయ్‌, అజిత్‌తో కలిసి నటించిన వివేక్‌ హాస్యం పంచారు.

కాగా గురువారం ఆయన కొవిడ్‌ టీకా తీసుకొన్నారు. 'ప్రతి ఒక్కరూ టీకా తీసుకొని, సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలి' అని ఆయన కోరారు. ఆయన నటించిన తమిళ సినిమాలు తెలుగులోనూ వచ్చాయి. 'అపరిచితుడు'లో విక్రమ్‌ స్నేహితుడిగా, రజనీ శివాజీలో ఆయన మేనమామగా, 'రఘు వరన్‌ బీటెక్‌'లో ధనుష్‌ సహచరుడిగా 'స్వర్ణపుష్పం' అంటూ ఫోన్‌లో మాట్లాడుతూ ప్రేక్షకుల్ని నవ్వించారు. హీ‌రో సూర్యతో కలిసి 'సింగం 2'లో ఎస్‌ఐ పాత్రలో మెప్పించారు. 'బాయ్స్‌' చిత్రంలోనూ నటించారు.

Kranthi

Kranthi

Next Story