Bollywood Actor Arrest: లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ నటుడి అరెస్ట్

Bollywood Actor Arrest: ప్రముఖ టెలివిజన్ నటుడు ప్రచీన్ చౌహాన్‌ లైంగిక వేధింపుల కేసులో శుక్రవారం సాయంత్రం అరెస్ట్ అయ్యారు

Sandeep Reddy
Published on: 4 July 2021 5:10 PM IST
Famous Actor Arrest In Molestation Case
X

ప్రచీన్ చౌహాన్‌ (ఫైల్ ఫోటో )

Bollywood Actor Arrest: ప్రముఖ టెలివిజన్ నటుడు ప్రచీన్ చౌహాన్‌ లైంగిక వేధింపుల కేసులో శుక్రవారం సాయంత్రం అరెస్ట్ అయ్యారు. 'కసౌతి జిందగీ కే' సీరియల్ తో బుల్లితెరకి పరిచయం అయిన ప్రచీన్ చౌహాన్‌ ఈ సీరియల్లో తను పోషించిన సుబ్రో బసు పాత్రతో మంచి పేరు సంపాదించాడు. ప్రచీన్ చౌహాన్ మరో ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే హతీమ్ మాట్ పితా కే చార్నన్, మెయిన్ స్వర్గ్ వంటి షోలు మరియు సీరియల్స్ ద్వారా మంచి ఫేమ్ పొందాడు. షాదీ ముబారక్ లో విశాల్ అగర్వాల్ పాత్రలో నటిస్తున్న ప్రచీన్ లైంగిక వేధింపుల కేసులో అరెస్టు కావడం సినిమా వర్గాల్లో సంచలనం రేపింది.

గురువారం రాత్రి ముంబై లోని మలాద్ ప్రాంతంలో ఉన్న తన ఇంట్లో ఏర్పాటు చేసిన పార్టీకి తన స్నేహితుడితో కలిసి వచ్చిన ఒక 22 ఏళ్ళ అమ్మాయితో మద్యం మత్తులో ప్రచీన్ చౌహాన్‌ లైంగికంగా వేధించడని తెలుస్తుంది. ఈ విషయాన్నీ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు శుక్రవారం ప్రచీన్ చౌహాన్‌ నూ అరెస్ట్ చేసి ఎఫ్ ఐ ఆర్ ఫైల్ చేసారు. అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రాజేంద్ర మోహితే మాట్లాడుతూ బాధితురాలి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఈ ఘటనలో ప్రచీన్ చౌహాన్‌ పై 323,354,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story