Pushpa: గుండు తో షాక్ ఇచ్చిన స్టార్ హీరో

Fahadh Faasil’s New Look Revealed in Pushpa
x

Pushpa: గుండు తో షాక్ ఇచ్చిన స్టార్ హీరో

Highlights

Pushpa: "రంగస్థలం" సినిమా సూపర్ హిట్ అందుకున్న సుకుమార్ ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా "పుష్ప" సినిమాతో బిజీగా ఉన్నారు.

Pushpa: "రంగస్థలం" సినిమా సూపర్ హిట్ అందుకున్న సుకుమార్ ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా "పుష్ప" సినిమాతో బిజీగా ఉన్నారు. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళంలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న ఫాహాద్ ఫాసిల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్రలో నటించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ లో అల్లు అర్జున్ రస్టిక్ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. హీరో లుక్ అంత బాగుంటే విలన్ ఫాహాద్ ఫాసిల్ పాత్ర ఎలా ఉండబోతోంది అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తాజాగా సినిమా లోనుంచి ఫాహాద్ ఫాసిల్ పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు దర్శక నిర్మాతలు. కానీ ఫహాద్ ఫాజిల్ తన గుండు లుక్కుతో ప్రేక్షకులను షాక్కి గురి చేశారు. ఈ సినిమాలో కాజల్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. బన్వర్ సింగ్ షెకావత్ అనే పేరుతో ఆయన పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు విడుదలైన పోస్టర్ చూశాక మాత్రం అదేమి లుక్ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. మలయాళంలో ఓ స్టార్ హీరో అయిన ఫాహాద్ ఫాసిల్ ను ఇలా గుండు లుక్కుతో చూపించడం ఏ మాత్రం బాగా లేదని కొందరు నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. మరి ఫాహాద్ ఫాసిల్ లుక్ భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న "పుష్ప" సినిమాకి ఏ మాత్రం ప్లస్ అవుతుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories