Pushpa: ఫహాద్ ఫాజిల్ డబ్బింగ్ పై డైరెక్టర్ కీలక నిర్ణయం!

Fahadh Faasil own Dubbing for Pushpa Movie
x

సుకుమార్, ఫహాద్ ఫాజిల్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో రానున్న సినిమా 'పుష్ప'. ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి.

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో రానున్న సినిమా 'పుష్ప'. ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి. ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నాడు. అవినీతి పరుడైన పోలీస్ ఆఫీసర్ గా ఆయన కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ పాత్రపై డైరెక్టర్ సుకుమార్ ఓ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

తాజాగా ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో 'అనుకోని అతిథి' సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఫాజిల్ పాత్రకు హీరో తరుణ్ తో డబ్బింగ్ చెప్పాడు. దీంతో 'పుష్ప' సినిమాలోనూ ఫాజిల్ పాత్రకు తరుణ్ తోనే డబ్బింగ్ చెప్పిస్తారేమోనని అనుకున్నారు.

కానీ, డైరెక్టర్ సుకుమార్ మాత్రం ఫాజిల్ పాత్రకు.. ఆయనతోనే డబ్బింగ్ చెప్పించే ప్లాన్‌లో ఉన్నాడంట. అందుకే ఫహాద్ ఫాజిల్ కి చిత్తూరు యాస నేర్పించేందుకు ఏర్పాట్లు చేశాడట సుక్కు. ఫాజిల్‌ కూడా తన పాత్రకు తనే డబ్బింగ్‌ చెప్పేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాడంట. అందుకోసమే చిత్తూరు భాషను నేర్చుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాడంట. షూటింగ్ పూర్తయ్యేలోపు ఫహద్ ఫాజిల్ చిత్తూరు యాస నేర్చుకోవాలని టార్గెట్ కూడా పెట్టుకున్నాడంట. అది సాధ్యంకాకపోతే మరో డబ్బింగ్ ఆర్టిస్ట్ తో పని పూర్తి చేయాలనే ప్లాన్ లో ఉన్నారంట.

Show Full Article
Print Article
Next Story
More Stories