F3 Pre Release Business: "ఎఫ్3" టార్గెట్ ఎంతో తెలుసా..?

F3 Movie Pre Release Business Report
x

F3 Pre Release Business: "ఎఫ్3" టార్గెట్ ఎంతో తెలుసా..?

Highlights

F3 Movie: వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో మల్టీస్టారర్ సినిమా గా వచ్చిన ‘ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

F3 Movie: వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో మల్టీస్టారర్ సినిమా గా వచ్చిన 'ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్' సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా "ఎఫ్3" త్వరలో రాబోతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమాలో తమన్నా మరియు మెహరీన్ లు హీరయిన్లుగా నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా మే 27 న థియేటర్లలో విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా 80 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. "ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్" సినిమా బాక్సాఫీస్ వద్ద 80 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ నేపథ్యంలో "ఎఫ్ 3" బిజినెస్ కూడా బాగానే జరిగింది.

ఎలాగో నైజాం ఏరియాలో దిల్ రాజు స్వయంగా ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సినిమా థియేట్రికల్ రైట్స్ అరవై మూడు కోట్లు. భారత దేశంలో మిగతా ప్రాంతాల నుంచి ఏడు కోట్ల కు అమ్ముడు అవ్వగా కర్ణాటకలో మరొక 7 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా. 75 నుంచి 78 కోట్ల వరకు ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక సినిమా 80 కోట్లు వసూలు చేస్తేనే సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్ కి చేరుతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో వేచి చూడాలి. ప్రగతి, ప్రకాష్ రాజ్, సునీల్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories