F3 Movie Collections: మొదటి రోజు భారీ కలెక్షన్లు చేసిన "ఎఫ్ 3"

F3 Movie Day 1 Box Office Collections
x

F3 Movie Collections: మొదటి రోజు భారీ కలెక్షన్లు చేసిన "ఎఫ్ 3"

Highlights

F3 First Day Box Office Collections: వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో మల్టీస్టారర్ సినిమా గా వచ్చిన "ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్" సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

F3 First Day Box Office Collections: వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో మల్టీస్టారర్ సినిమా గా వచ్చిన "ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్" సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా "ఎఫ్3" విడుదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో తమన్నా మరియు మెహరీన్ లు హీరయిన్లుగా నటించారు. ప్రగతి, ప్రకాష్ రాజ్, సునీల్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించగా దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఒక సరికొత్త ప్లాట్ లైన్ తో భారీ అంచనాల మధ్య ఈ సినిమా మే 27 న థియేటర్లలో విడుదల అయ్యి మొదటి రోజు నుండి సూపర్ హిట్ టాక్ ను అందుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు సినిమా దాదాపు రూ. 10.35 కోట్లు షేర్ వ‌సూళ్ల‌ను సాధించగా ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆమెరికాలో ఈ చిత్రం 0.5 మిలియన్‌ డాలర్లను వసూలు చేయగా వారాంతంలోపు 1 మిలియన్‌ డాలర్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు చెబతున్నాయి. ఈ సినిమా రూ.63.82 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది కాబట్టి బ్రేక్ ఈవెన్‌కు రూ.64 కోట్ల షేర్‌ రాబట్టాలి.

ఎఫ్‌3 ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ ఇలా ఉన్నాయి

నైజాం: రూ.4.06 కోట్లు

సీడెడ్: రూ.1.26 కోట్లు

ఈస్ట్: రూ.76 లక్షలు

వెస్ట్: రూ.96లక్షలు

ఉత్త‌రాంధ్ర: రూ.1.18 కోట్లు

గుంటూరు: రూ.88 లక్షలు

కృష్ణా: రూ. 67 లక్షలు

నెల్లూరు: రూ.62లక్షలు

మొత్తం: రూ.10.37కోట్లు

Show Full Article
Print Article
Next Story
More Stories