భారీ ప్రాఫిట్ లు తెచ్చిపెట్టిన 'ఎఫ్ 2'

భారీ ప్రాఫిట్ లు తెచ్చిపెట్టిన ఎఫ్ 2
x
Highlights

సీనియర్ హీరో వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా హాట్ట్రిక్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎఫ్ 2' సినిమా బ్లాక్ బస్టర్...

సీనియర్ హీరో వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా హాట్ట్రిక్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎఫ్ 2' సినిమా బ్లాక్ బస్టర్ గా మారింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ పిర్జాదా లు హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం అనుకున్న దానికంటే ఎక్కువ వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాక టాలీవుడ్ టాప్ టెన్ చిత్రాల జాబితాలో ఎనిమిదవ స్థానాన్ని దక్కించుకుంది.

34.5 కోట్లకు అమ్ముడైన ఈ సినిమా ఏకంగా 81.05 కోట్లను ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే విడుదల అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ చిత్రం విడుదల అయినప్పటికీ థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపించి వరుణ్ తేజ్ మరియు వెంకి కేరళలోని ఎక్కువ వసూలు చేసిన సినిమాగా నిలిచింది.

ఏరియాల వారిగా 'ఎఫ్ 2' చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజాం: 22.8 కోట్లు

సీడెడ్: 8.7 కోట్లు

ఉత్తరాంధ్ర: 10.50 కోట్లు

గుంటూరు: 5.6 కోట్లు

ఈస్ట్: 7 కోట్లు

వెస్ట్: 4.3 కోట్లు

కృష్ణ: 5.2 కోట్లు

నెల్లూరు: 2.05 కోట్లు

ఏపీ+టీఎస్ మొత్తం షేర్: 66.15 కోట్లు

ఇండియా ఇతరం: 5.60 కోట్లు

ఓవర్సీస్: 9.30 కోట్లు

మొత్తం: 81.05 కోట్లు

Show Full Article
Print Article
Next Story
More Stories