MAA Elections 2021: "మా" ఎన్నికలో కొత్త మలుపు

MAA Elections 2021: క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు ఎగ్జిక్యూటివ్ సభ్యుల లేఖ

Sandeep Eggoju
Published on: 28 July 2021 11:51 AM IST
Executive Members Letter to Disciplinary Committee President Krishnam Raju
X
కృష్ణం రాజు (ఫైల్ ఇమేజ్)

MAA Elections 2021: మా అసోసియేషన్ ఎన్నికల్లో ట్విస్ట్ నెలకొంది. మాకు చెందిన 15 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు మరో లేఖ రాశారు. ప్రస్తుత కార్యనిర్వాహక కమిటీకి కాలం చెల్లిందని వెంటనే ఎన్నికలు నిర్వహించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు సభ్యులు. గతంలో రాసిన లేఖకు సమాధానం లేకపోవడంతో మరోసారి లేఖ పంపారు.

మార్చిలో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇప్పటి వరకు జరగలేదని, దీంతో కార్యవర్గం లేకుండానే నడుస్తోందన్నారు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు. క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా, 'మా'లో సీనియర్ సభ్యుడిగా ఉన్న కృష్ణంరాజును ఆ బాధ్యతలు చేపట్టి తక్షణం ఎన్నికలు చేపట్టాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక గురువారం జరగనున్న ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి మా అధ్యక్షుడు నరేష్ అధ్యక్షత వహించాల్సి ఉండగా, ఆయనకు బదులుగా కృష్ణంరాజు అధ్యక్షత వహించనున్నట్టు సమాచారం. కృష్ణం రాజుకు అందిన లేఖలపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story