పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. రీ రిలీజ్‌కు సిద్ధమైన 'గబ్బర్ సింగ్'.. ట్రైలర్ రిలీజ్ చేసిన హరీశ్ శంకర్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సెప్టెంబర్ 2వ తేదీన పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకోనున్నారు.

Exciting news for Power Star fans! Gabbar Singh is ready for a re-release. Harish Shankar has released the trailer for it
X

పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. రీ రిలీజ్‌కు సిద్ధమైన 'గబ్బర్ సింగ్'.. ట్రైలర్ రిలీజ్ చేసిన హరీశ్ శంకర్

పపర్ స్టార్ పవన్ కల్యాణ్ సినీ కెరీర్లో గబ్బర్ సింగ్ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ మేనరిజమ్స్, డైలాగ్స్, యాక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. గబ్బర్ సింగ్ చిత్రం ఎప్పటికీ పవన్ అభిమానులకు గుర్తుండిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దేవి శ్రీ ప్రసాద్ పాటలు ఈ సినిమాకు మరో హైలెట్, అలాంటి చిత్రం ఇప్పుడు మళ్లీ వెండితెరపైకి వస్తోంది. ఈ మూవీ రీ-రిలీజ్ కానుంది.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సెప్టెంబర్ 2వ తేదీన పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకోనున్నారు. ఈ సందర్భంగానే గబ్బర్ సింగ్ మూవీ స్పెషల్ షోలు ఉండనున్నాయి. సెప్టెంబర్ 2న ఈ మూవీ థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రీ రిలీజ్ ట్రైలర్‌ను దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ లో విడుదల చేశారు.

అనుశ్రీ ఫిలిమ్స్ గబ్బర్ సింగ్ మూవీని సెప్టెంబర్ 2న రీ-రిలీజ్ చేస్తోంది. మొత్తంగా ఈ బ్లాక్‍బస్టర్ చిత్రాన్ని ఫ్యాన్స్ మరోసారి థియేటర్‌లో చూసే అవకాశం దొరికింది. ఈ చిత్రం రీ-రిలీజ్‍కు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసేందుకు ఫ్యాన్స్ కూడా సిద్ధమయ్యారు.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story