Konda Polam: టీవీ రేటింగ్స్ లో రికార్డులు సృష్టిస్తున్న కొండపొలం

Konda Polam: పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా "ఉప్పెన" వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం "కొండపొలం".

admin1
Updated on: 14 Jan 2022 5:00 PM IST
Excellent Viewership for Konda Polam in Television
X

Konda Polam: టీవీ రేటింగ్స్ లో రికార్డులు సృష్టిస్తున్న కొండపొలం

Konda Polam: పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా "ఉప్పెన" వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం "కొండపొలం". రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించారు. అయితే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది. తాజాగా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ స్టార్ మా లో జరిగింది. ఆసక్తికరంగా అర్బన్ టీవీ రేటింగ్స్ లో కొండపొలం సినిమాకి 12.34 రేటింగ్ రాగా యూ ప్లస్ ఆర్ రేటింగ్స్ లో 10.54 రేటింగ్ను సొంతం చేసుకొని సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇక థియేటర్ల నుంచి వెళ్లిపోయాక కొండపొలం సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో కూడా స్ట్రీమ్ అవుతుంది కానీ థియేటర్లు, ఓటీటీ కంటే టీవీలో ఈ సినిమా రికార్డులను సృష్టించింది. ఈ సినిమా మాత్రమే కాక వైష్ణవ్ నటించిన "ఉప్పెన" సినిమాకి కూడా టీవీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.

admin1

admin1

Next Story