Evaru Meelo Koteeswarudu: ఎన్టీఆర్ భజన చేస్తున్న గేమ్ షో కంటెస్టెంట్లు

* ఎంత అభిమానులైనా సరే మరీ అంతగా ఎన్టీఆర్ కి భజన చేయాల్సిన అవసరం లేదంటూ కొందరు కామెంట్లు కూడా చేస్తున్నారు

admin1
Updated on: 23 Sept 2021 1:30 PM IST
Evaru Meelo Koteeswarudu Show Constentants and Fans Praising a Lot about NTR
X

 "ఎవరు మీలో కోటీశ్వరుడు" గేమ్ షో - ఎన్టీఆర్ (ఫోటో- ది హన్స్ ఇండియా )

Evaru Meelo Koteeswarudu - NTR: జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న "ఎవరు మీలో కోటీశ్వరుడు" గేమ్ షో కాన్సెప్ట్ అందరికీ తెలిసిందే కానీ ఈ షో కి టీఆర్పిలు రావడానికి కారణం ఎన్టీఆర్. బిగ్ బాస్ సీజన్ 1 తో హోస్ట్ గా ప్రేక్షకులను అలరించిన ఎన్టీఆర్ మళ్లీ ఇప్పుడు "ఎవరు మీలో కోటీశ్వరుడు" అనే టాక్ షో తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఎన్టీఆర్ ప్రెజెన్స్ ఈ షో కి చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. కానీ ఆ షో కి వచ్చే పార్టిస్పెంట్స్ మాత్రం ఎన్టీఆర్ భజన చేస్తునట్టుగా ప్రవర్తిస్తున్నారని కొందరు అంటున్నారు.

ఒకవేళ ఆ షో కి వచ్చిన కొందరు ఎన్టీఆర్ అభిమానులు అయినా ఎన్టీఆర్ ని పొగడటం మాత్రమే కాక మరియు ఎన్టీఆర్ భజన చేయటం మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నట్లు కొందరు ఆరోపిస్తున్నారు. ఎన్టీఆర్ ని పొగిడితే తమకు బుల్లితెరపై కనిపించే సమయం మరింత పెరుగుతుందని వచ్చిన వాళ్ళందరూ ఉన్న దానికంటే కొంచెం ఎక్కువగానే ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నట్లు అనిపిస్తోంది. కానీ ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ మాత్రం మౌనం వహిస్తున్నారు. మరోవైపు ఎంత అభిమానులైనా సరే మరీ అంతగా ఎన్టీఆర్ కి భజన చేయాల్సిన అవసరం లేదంటూ కొందరు కామెంట్లు కూడా చేస్తున్నారు.

admin1

admin1

Next Story