Bhumika Chawla: పవన్ కళ్యాణ్‌పై భూమిక ఆసక్తికర వ్యాఖ్యలు.. ఖుషి నుంచి డెప్యూటీ సీఎం వరకు!

Bhumika Chawla: పవన్ కళ్యాణ్‌పై భూమిక ఆసక్తికర వ్యాఖ్యలు.. ఖుషి నుంచి డెప్యూటీ సీఎం వరకు!
x

Bhumika Chawla: పవన్ కళ్యాణ్‌పై భూమిక ఆసక్తికర వ్యాఖ్యలు.. ఖుషి నుంచి డెప్యూటీ సీఎం వరకు!

Highlights

Bhumika Chawla: టాలీవుడ్ సీనియర్ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్న కథా చిత్రం ‘యుఫోరియా’ (Euphoria) విడుదలకు సర్వం సిద్ధమైంది.

Bhumika Chawla: టాలీవుడ్ సీనియర్ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్న కథా చిత్రం ‘యుఫోరియా’ (Euphoria) విడుదలకు సర్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా సాంగ్ లాంచ్ కార్యక్రమం విశాఖపట్నంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

స్టార్ హీరో రేంజ్‌లో జనసందోహం

సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు ఉండే క్రేజ్ ఈ ఈవెంట్‌లో కనిపించింది. భారీ ఎత్తున తరలివచ్చిన జనాలను చూసి దర్శకుడు గుణశేఖర్ ఆనందం వ్యక్తం చేశారు. "వైజాగ్‌లో ఇంత పెద్ద ఎత్తున స్పందన రావడం సంతోషంగా ఉంది. సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లోకి వెళ్ళిందని ఈ ఈవెంట్ నిరూపించింది. కచ్చితంగా మంచి ఓపెనింగ్స్ వస్తాయని నమ్ముతున్నాను" అని ఆయన పేర్కొన్నారు.

భూమిక సెకండ్ ఇన్నింగ్స్ మెగా హిట్?

ఈ సినిమాలో సీనియర్ నటి భూమిక చౌల కీలక పాత్రలో నటించారు. ఈతరం తల్లులు తమ పిల్లలను (ముఖ్యంగా మగపిల్లలను) ఎలా పెంచాలి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనే సందేశాన్ని భూమిక పాత్ర ద్వారా చూపించబోతున్నారు. తన కెరీర్‌లోనే 'యుఫోరియా' టాప్ పొజిషన్‌లో నిలుస్తుందని, ఇది తనకు ఒక గొప్ప సెకండ్ ఇన్నింగ్స్ అవుతుందని భూమిక ధీమా వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్‌పై ప్రశంసల జల్లు

వైజాగ్‌ ఈవెంట్‌లో భూమిక మాట్లాడుతూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. "ఖుషి సినిమాలో ఆయనతో కలిసి నటించాను. ఒక గొప్ప వ్యక్తిగా పవన్ గారిని ఎప్పుడూ గౌరవిస్తాను. ఆయన ఇప్పుడు ఏపీ డెప్యూటీ సీఎం కావడం చాలా గర్వంగా ఉంది. 'ఖుషి' నుంచి 'ఉప ముఖ్యమంత్రి' వరకు ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయకం" అంటూ ప్రశంసలు కురిపించారు. అలాగే వైజాగ్‌లో ఈవెంట్ నిర్వహించుకునే అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

గుణశేఖర్ మార్క్ సోషల్ మూవీ

'రుద్రమదేవి', 'శాకుంతలం' వంటి భారీ పౌరాణిక చిత్రాల తర్వాత గుణశేఖర్ చాలా కాలం తర్వాత ఒక సామాజిక ఇతివృత్తంతో (Social Concept) వస్తున్నారు. భూమికతో పాటు సారా అర్జున్, నాజర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. గుణశేఖర్ కుమార్తెలు నీలిమ గుణ, యుక్తా గుణ ఈ చిత్రాన్ని నిర్మించగా, రాగిణి గుణ సమర్పిస్తున్నారు.

చాలా ఏళ్ల క్రితం 'నిప్పు' వంటి సోషల్ మూవీ తీసిన గుణశేఖర్, ఇప్పుడు 'యుఫోరియా'తో మళ్ళీ తన మార్క్ విభిన్నమైన కథను ప్రేక్షకులకు అందించబోతున్నారు. ఫిబ్రవరి 6న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories