Tollywood Drugs Case: 4 గంటలుగా రవితేజను విచారిస్తున్న ఈడీ అధికారులు

* రవితేజ డ్రైవర్‌పైనా ప్రశ్నల వర్షం కురిపిస్తున్న ఈడీ * ఈడీ విచారణకు హాజరైనా జిషాన్ అలీ ఖాన్‌

Sandeep Reddy
Published on: 9 Sept 2021 3:08 PM IST
Enforcement Directorate Inquiring Ravi Teja From Last Four Hours in Tollywood Drugs Case Today 09 09 2021
X

రవితేజ 

Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రాగ్స్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. దాదాపు నాలుగు గంటలుగా హీరో రవితేజ, అతడి డ్రైవర్ శ్రీనివాస్‌లను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో డ్రగ్స్ కేసులో నిందితుడైన జి షాన్ అలీ ఖాన్‌ను పిలిపించిన ఈడీ అతడిపైనా ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. టాలీవుడ్‌లో సంచలనం కలిగించిన ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్ తర్వాత జిషాన్ అలీ కీలక సూత్రధారి కావడంతో కీలక ఆధారాలు సేకరించే ఛాన్స్ కనిపిస్తోంది.

మరోవైపు రవితేజ విచారణ కొనసాగుతున్న సమయంలోనే జిషాన్ అలీ ఖాన్‌ను పిలిపించడం ఆసక్తి రేపుతోంది. 2017లో మొదటగా జిషాన్ అలీ ఖాన్‌ను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో టాలీవుడ్ సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. దీంతో ఇవాల్టి విచారణలో కీలక ఆధారాలు రాబట్టే అవకాశం కనిపిస్తోంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story