Ek Mini Katha: ఏక్ మినీ క‌థ ఓటీటీలో స్ట్రీమింగ్

Ek Mini Katha: కార్తీక్ రాపోలు ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతూ సంతోష్ హీరోగా తెర‌కెక్కిన చిత్రం 'ఏక్ మినీ క‌థ'.

Samba Siva Rao
Updated on: 26 May 2021 6:54 PM IST
Ek Mini Katha on OTT
X

Ek Mini Katha

Streaming: కార్తీక్ రాపోలు ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతూ సంతోష్ హీరోగా తెర‌కెక్కిన చిత్రం 'ఏక్ మినీ క‌థ'. లాక్ డౌన్ ముందే టీజర్, ప్రమోషన్లతో 'ఏక్ మినీ కథ' ఆకట్టుకుంది. యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో 'ఎక్స్‌ప్రెస్ రాజా' సినిమా చేసిన ర‌చ‌యిత‌, ద‌ర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి క‌థ‌ని అందించారు. 'వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌', 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'కృష్ణార్జున యుద్ధం' చిత్రాల‌తో మేర్లపాక గాంధీ గుర్తింపు తెచ్చుకున్నారు.

సినిమాపై జనాలు ఆస‌క్తి కనబర్చే లోపే లాక్ డౌన్ వచ్చి, అంతా సైలంట్ అయిపోయింది. ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా నిర్మాతలు యువి సంస్థ అధినేతలు, వంశీ, విక్రమ్ ఆమెజాన్ ప్రైమ్ వీడియోకు ఈ సినిమాను విక్ర‌యించారు. ఈ రోజు రాత్రి ఈ సినిమా ఓటీటీలో విడుద‌ల అవుతోంది. డైరక్టర్ శోభన్ కొడుకు సంతోష్ ఇప్పటికి ఒకటి రెండు సినిమాలు చేసినా బ్రేక్ రాలేదు. ఈ సినిమాతో బ్రేక్ వస్తుందనే ఆశతో వున్నాడు.

సంతోష్ శోభన్ సరసన కావ్య త‌ప్పర్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో శ్రద్ధాదాస్‌, బ్రహ్మజి, స‌ప్తగిరి, సుద‌ర్శన్‌, పోసాని కృష్ణముర‌ళి, జ‌బ‌ర్దస్త అప్పారావు, రూప లక్ష్మి, జెమిని సురేష్‌, ప్రభు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం మసకూరుస్తు్న్న ఈ చిత్రానికి గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story