ఈషా కూడా అదే జాబితాలో చేరిపోయిందే

Ruthvik
Published on: 29 March 2019 11:31 AM IST
ఈషా కూడా అదే జాబితాలో చేరిపోయిందే
X

పరభాషా హీరోయిన్లకు మాత్రం స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం వస్తున్నాయి కానీ తెలుగమ్మాయిలకి మాత్రం తెలుగులో మంచి అవకాశాలు చాలా అరుదుగా అందుతూ ఉంటాయి. అది విచిత్రమో ఏమో తెలియదు కాని దాదాపు అందరు తెలుగుహీరోయిన్లు హారర్ సినిమాలకే పరిమితమవుతున్నారు. ఇప్పటికే నందిత 'ప్రేమ కథ చిత్రం', స్వాతి 'త్రిపుర' వంటి హారర్ చిత్రాల్లో కనిపించారు. ఇక అంజలి అయితే 'గీతాంజలి', 'చిత్రాంగద', 'బెలూన్' లాంటి హారర్ సినిమాల్లో నటించింది. ఇప్పుడు ఈ జాబితాలో ఇంకొక తెలుగమ్మాయి చేరనుంది. ఆమె ఎవరో కాదు ఈషా రెబ్బ. ఈమధ్యనే 'అరవింద సమేత' సినిమాలో ఏమంత ప్రధాన్యతలేని పాత్రలో కనిపించిన ఈమె ఇప్పుడు ఒక హారర్ సినిమాలో నటించనుంది. 'డమరుకం' ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం లో ఒక కొత్త చిత్రాన్ని ఈషా ఒప్పుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈషా ఈ సినిమా లో ముఖ్య పాత్ర పోషిస్తుందట. హారర్ థ్రిల్లర్ తరహాగా ఉండే ఈ సినిమా మొత్తం హీరోయిన్ చుట్టూ నే తిరుగుతుంది అని తెలుస్తోంది. ఇప్పటికే 'బ్రాండ్ బాబు', 'సుబ్రహ్మణ్యపురం' లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచిపేరు తెచ్చుకోలేకపోయిన ఈషా ఈ సినిమాపైనే తన ఆశలన్నీ పెట్టుకుంది.

Ruthvik

Ruthvik

Next Story