Paagal: 'పాగల్' నుంచి 'ఈ సింగిల్ చిన్నోడే' సాంగ్ రిలీజ్..

Ee Single Chinnode Lirical video Song From Paagal
x

పాగల్ సినిమా పోస్టర్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Paagal: యంగ్‌ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'పాగల్'. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు.

Paagal: యంగ్‌ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'పాగల్'. ఇందులో నివేదా పేతురాజ్, సిమ్రాన్ చౌదరి, మేఘ లేఖ అనే ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఈ యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను నరేష్ కొప్పల్లి అనే నూతన డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి 'ఈ సింగిల్ చిన్నోడే' అనే సాంగ్ లిరికల్ వీడియోని మూవీ యూనిట్ య్యూటూబ్‌లో విడుదల చేసింది.

ఈ క్రేజీ సాంగ్ యూత్ ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఈ సాంగ్‌లో సిమ్రాన్ చౌదరి, మేఘ లేఖ లను లవ్‌లో పడేసేందుకు విశ్వక్ సేన్ ప్రయత్నిస్తుండాన్ని సాంగ్‌లో చూపించారు. అలాగే విశ్వక్ స్టెప్పులు ఆకట్టుకున్నాయి. ఈ సాంగ్‌ను కృష్ణ కాంత్ రచించగా... బెన్నీ దాయాల్ ఆలపించారు. దిల్ రాజు సమర్పణలో తెరకెక్కనున్న ఈ సినిమాను లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రథన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మే 1న విడుదల కావాల్సిన 'పాగల్' సినిమా కరోనా సెకండ్ వేవ్‌తో వాయిదా పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories