Radhe Shyam - Ee Rathale Song: "ఈ రాతలే.. దోబూచులే" అంటూ "రాధేశ్యామ్" ఫస్ట్ సాంగ్

* "రాధేశ్యామ్" చిత్రం నుండి "ఈ రాతలే.." ఫుల్ సాంగ్ లిరికల్ వీడియోని విడుదల

Sandeep Reddy
Published on: 15 Nov 2021 10:06 PM IST
Ee Rathale Full Lyrical Song Released From Prabhas Radhe Shyam Movie Today 15 11 2021
X

Radhe Shyam - Ee Rathale Song

Radhe Shyam - Ee Rathale Song: ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న "రాధేశ్యామ్" సినిమా మొదటి సింగిల్ తాజాగా విడుదలైంది. కే. రాధాకృష్ణ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ - పూజ హేగ్దే జంటగా నటించిన "రాధేశ్యామ్" చిత్రం నుండి "ఈ రాతలే.." ఫుల్ సాంగ్ లిరికల్ వీడియో నవంబర్ 15న విడుదల చేసింది చిత్ర యూనిట్. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన "రాధేశ్యామ్" చిత్రానికి యూవి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరించారు.

చేతి రాతలను చూసి భవిష్యత్తు చెప్పే విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ నటించగా, "ప్రేరణ" అనే పాత్రలో పూజ హెగ్డే కనిపించబోతుంది. ఇప్పటికే ఇటలీలోనే సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉంది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా "రాధేశ్యామ్" చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఇక ఈ పాటని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయగా ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్, అమిత్ త్రివేది సంగీత దర్శకులుగా పనిచేశారు.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story