Tollywood Drugs Case: డ్రగ్స్‌ కేసులో దూకుడు పెంచిన ఈడీ

Tollywood Drugs Case: పూరీ జగన్నాథ్‌, ఛార్మి, రకుల్‌ ఈడీ విచారణ పూర్తి * మరికొందరిని విచారించేందుకు సిద్ధంగా ఉన్న ఈడీ

Sandeep Eggoju
Updated on: 6 Sept 2021 2:52 PM IST
ED Speed up the Tollywood Drugs Case Investigation
X
డ్రగ్స్ కేసులో దుకుడు పెంచిన ఈడీ (ఫైల్ ఇమేజ్)

Tollywood Drugs Case: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్‌ వ్యవహారం తెరపైకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం ఇదే కేసులో తెలంగాణ ఎక్సైజ్‌ అధికారులు.. ఆధారాల్లేవని సినీ ప్రముఖుల పేర్లను ఛార్జిషీట్లో నమోదు చేయలేదు. కానీ ఇప్పుడు మరోసారి డ్రగ్స్‌ కేసు ఊపందుకుంది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని విచారించిన ఈడీ.. మరికొందరి ఇంటరాగేషన్‌ చేసేందుకు దూకుడుగా వ్యవహరిస్తోంది.

టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం ఇప్పటికే ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కెల్విన్ అనే డ్రగ్ పెడ్లర్ ఇచ్చిన వివరాల ఆధారంగా.. డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరోయిన్లు ఛార్మీ, రకుల్ ప్రీత్‌సింగ్‌ల ఈడీ విచారణ పూర్తయింది. ఇంకా రానా దగ్గుబాటి, రవితేజతోపాటు డ్రైవర్ శ్రీనివాస్, నవదీప్, ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్, ముమైత్ ఖాన్, తనీష్, నందు, తరుణ్‌ ఈడీ ఎదుట హాజరుకావాల్సి ఉంది. వీళ్లందరి విచారణ అనంతరం.. మరికొంత మందికి ఈడీ నోటీసులు పంపే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది.

డ్రగ్స్ అనేది కేవలం సెలబ్రిటీల సమస్య కాదు. ఇది ప్రతి ఒక్కరి సమస్య. సరిహద్దు సమస్య. పొలిటికల్ అజెండాతో జరుగుతున్న వ్యవహారం. బలమైన ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమస్య. ఈ మొత్తం వ్యవహారంపై ఈ త్వరలోనే నా స్వీయ అనుభవాలను మీతో పంచుకుంటాను అని పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం పూనమ్ చేసిన ఈ ట్వీట్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. ఆ రాజకీయం ఏమిటి..? టాలీవుడ్‌ను ఎవరు టార్గెట్ చేశారు..? ఇవన్నీ పూనమ్ కౌర్‌కు ఎలా తెలుసు..? లాంటి ప్రశ్నలతో టాలీవుడ్‌లోని చిన్న, పెద్ద సతమతమవుతున్నారు.

మరోవైపు అసలు డ్రగ్స్ వాడారా? లేదా..? అన్నది పక్కన బెడితే.. మనీలాండరింగ్ కోణంలోనే ప్రధానంగా ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. నగదు లావాదేవీలను బయటకు తీసి వివరాలు తెలుసుకుంటున్నారు అధికారులు. అసలు ఈడీ ఎలాంటి వివరాలు బయటపెడుతుందో.. పూనంకౌర్ బ్యాక్ గ్రౌండ్ విషయాలు ఏమి చెబుతుందో కానీ.. ముందు ముందు మరిన్ని సంచలన విషయాలు మాత్రం బయటకు రానున్నాయని తెలుస్తోంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story