Mohanlal: చిక్కుల్లో మోహన్‌ లాల్‌.. ఈడీ నోటీసులు..!

Mohanlal: మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ చిక్కుల్లో ప‌డ్డారు.

Arun Chilukuri
Published on: 14 May 2022 7:24 PM IST
ED Serves Notice to Actor Mohanlal
X

Mohanlal: చిక్కుల్లో మోహన్‌ లాల్‌.. ఈడీ నోటీసులు..!

Mohanlal: మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ చిక్కుల్లో ప‌డ్డారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మోహన్ లాల్ కు నోటీసులు జారీ చేసింది. వ‌చ్చే వారం విచార‌ణ‌ కోసం కొచ్చికి రావాలని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. కేర‌ళ‌కు చెందిన వ్యాపారి మాన్సన్ మాన్కల్‌తో క‌లిసి మోహ‌న్ లాల్ మ‌నీ ల్యాండ‌రింగ్‌కు పాల్పడిన‌ట్టు ఆరోప‌ణ‌లున్నాయి. ఈ కేసులో మాన్సన్‌ను గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లోనే కేర‌ళ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసుపై ఈడీ దృష్టి సారించింది. మాన్సన్‌తో క‌లిసి మోహ‌న్ లాల్ కూడా మ‌నీ ల్యాండ‌రింగ్‌కు పాల్పడిన‌ట్టు భావిస్తోంది. ఈ విష‌యం నిర్ధార‌ణ కోస‌మే మోహన్ లాల్ కు నోటీసులు జారీ చేసిన‌ట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story