logo

టైటిల్ బాధ్యత ఫ్యాన్స్ కి వదిలేసిన నిర్మాత

టైటిల్ బాధ్యత ఫ్యాన్స్ కి వదిలేసిన నిర్మాత

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం చేసినప్పటినుంచి ఈ సినిమాని 'ఆర్ఆర్ఆర్' అనే పిలవడం అందరికీ అలవాటైపోయింది. ఈ సినిమా ఎనౌన్స్ చేసినప్పుడు టైటిల్ అర్ధం రాజమౌళి, రామ్ చరణ్, రామారావు అని. కానీ అధికారిక టైటిల్ విషయంలో మాత్రం చిత్ర బృందం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. తాజాగా జరిగిన ప్రెస్మీట్లో రాజమౌళి ఆ నిర్ణయాన్ని ఫాన్స్ కి వదిలేస్తున్నామని చెప్పిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఫాన్స్ 'ఆర్ ఆర్ ఆర్' కి ఫుల్ ఫామ్ అంటూ బోలెడు టైటిల్స్ సజెస్ట్ చేశారని, అవి చాలా బాగున్నాయని ఇంకా కొన్ని మంచి టైటిల్స్ కోసం ఎదురుచూస్తున్నామని, ఏదైనా నచ్చితే కచ్చితంగా దాన్ని ఓకే చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో నిర్మాత దానయ్య కూడా అధికారికంగా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు. #RRRTitle అని 'ఆర్ ఆర్ ఆర్' కు తమకు నచ్చిన టైటిల్స్ను పంపవచ్చని, అందులో బాగున్న టైటిల్ సినిమాకు ఖరారు చేస్తామని అధికారిక ప్రకటనను చేశారు. ఇంకెందుకు ఆలస్యం? మీకు నచ్చిన టైటిల్ ఉంటే చెప్పేయండి.

లైవ్ టీవి

Share it
Top