"దసరా ఒక ఎపిక్ సినిమా," అంటున్న నాని

Dussehra Is An Epic Film Says Nani
x

"దసరా ఒక ఎపిక్ సినిమా," అంటున్న నాని

Highlights

* "ఈ వజ్రం ఎప్పటికీ మెరుస్తుంది," అంటున్న నాని

Nani: ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా "దసరా". శ్రీకాంత్ ఓదెల అనే ఒక కొత్త డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు ఎన్నడూ కనిపించినటువంటి ఒక రస్టిక్ పాత్రలో నాని ఈ సినిమాలో కనిపించనున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నాని కెరియర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా విడుదల కాబోతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక ఈ సినిమా కథ మొత్తం తెలంగాణకి చెందిన గోదావరిఖని లో ఉన్న సింగరేణి బొగ్గు గని బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. గత కొంతకాలంగా నాని ఈ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ పూర్తయిందట. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు నాని. దసరా సినిమా ఒక ఎపిక్ సినిమా అని నాని అనటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. "దసరా అనే ఎపిక్ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ వజ్రం ఎప్పటికీ మెరుస్తూనే ఉంటుంది," అని సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు నాని.

అంతేకాకుండా విభిన్న లుక్కుతో అదిరిపోయే నేపథ్య సంగీతంతో తాను నడిచి వస్తున్న ఒక వీడియోని కూడా షేర్ చేశారు నాని. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సముతిరఖని, దీక్షిత్ శెట్టి, మీరా జాస్మిన్, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది మార్చ్ 30న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories