Duniya Vijay - Balakrishna: బాలయ్య కోసం విలన్ గా మారనున్న కన్నడ నటుడు

* దునియా విజయ్ ఇప్పుడు బాలయ్య సినిమాలో మెయిన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం

admin1
Published on: 7 Nov 2021 2:59 PM IST
Duniya Vijay will Appear as Villain in Balakrishna New Movie
X

బాలయ్య కోసం విలన్ గా మారనున్న దునియా విజయ్ (ఫైల్ ఫోటో)

Duniya Vijay - Balakrishna: టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో "అఖండ" అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా నటీనటులను వెతికే పనిలో పడ్డారు దర్శకనిర్మాతలు. ఈ మధ్యనే భారీ రెమ్యునరేషన్ ఆఫర్ ఇచ్చి గోపీచంద్ మలినేని తన "క్రాక్" బ్యూటీ శ్రుతి హాసన్ ను ఈ సినిమాలో కూడా ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో ఒక కన్నడ స్టార్ కూడా నటించబోతున్నారట. కన్నడలో "దునియా" సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న విజయ్ అభిమానులు అందరూ దునియా విజయ్ అని పిలుచుకుంటూ ఉంటారు.

కన్నడ స్టార్ దునియా విజయ్ ఇప్పుడు బాలయ్య సినిమాలో మెయిన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఈ సినిమాలో దునియా విజయ్ నెగటివ్ పాత్రలో కనిపించబోతున్నారట. దీని గురించిన అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల కాబోతోంది. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

admin1

admin1

Next Story