ప్యాన్ ఇండియన్ సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేసిన దుల్కర్ సల్మాన్

Dulquer Salmaan: ప్యాన్ ఇండియన్ సినిమా లపై షాకింగ్ కామెంట్స్ చేసిన దుల్కర్ సల్మాన్

Jyothi
Updated on: 4 Aug 2022 1:06 PM IST
Dulquer Salmaan Made Shocking Comments on Pan Indian Movies
X

ప్యాన్ ఇండియా సినిమా అంటేనే చిరాకు వస్తుంది అంటున్న దుల్కర్ సల్మాన్

Dulquer Salmaan: "మహానటి" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైన మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తాజాగా ఇప్పుడు "సీతారామం" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి హనురాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన్న మరియు తరుణ్ భాస్కర్ లు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఆగస్టు 5న థియేటర్లలో విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ తో బిజీగా ఉంది చిత్ర బృందం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్యాన్ ఇండియన్ సినిమా లపై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు దుల్కర్ సల్మాన్. ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

"ఈమధ్య కాలంలో పాన్ ఇండియా అనే పదాన్ని బాగా ఎక్కువగా వాడుతున్నారు. కానీ మాది ప్యాన్ ఇండియా సినిమా అంటేనే నాకు చిరాకు వస్తుంది. ఒక నటుడు వేరే భాషల్లో కూడా తన సినిమాని విడుదల చేసి హిట్ అందుకుంటే అది ప్యాన్ ఇండియా సినిమా కావచ్చు. కానీ అది నాకు అప్లై అవ్వదు. ఎందుకంటే నేను విభిన్న ఇండస్ట్రీలలో పనిచేస్తున్నాను" అని చెప్పుకొచ్చారు దుల్కర్ సల్మాన్. ఇక ఏ విషయంలో ఎక్కువ ప్రెషర్ తీసుకుంటారు అని అడగగా అభిమానులు తన సినిమాల నుంచి క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తారని ఆ క్వాలిటీ తన సినిమాలో నుంచి తగ్గుతుందేమోనని అప్పుడప్పుడు భయమేస్తుందని కానీ "సీతారామం" సినిమా క్వాలిటీ ఊహించినదానికంటే చాలా ఎక్కువగా ఉంటుందని అన్నారు.

Jyothi

Jyothi

Next Story