Pawan Kalyan: పవన్‌ అభిమానులకు నిరాశ.. నిర్మాణ సంస్థల కీలక ప్రకటన..!

Pawan Kalyan Birthday: పవన్ కళ్యాణ్‌.. ఈ పేరే ఓ సంచలనం. తనదైన మేనరిజం, అద్భుత నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు పవర్‌ స్టార్‌ పవన్‌.

Arun Chilukuri
Published on: 2 Sept 2024 10:23 AM IST
Due to Heavy Rains in Telugu States Pawan Kalyan New Movie Updates are Postponed
X

Pawan Kalyan: పవన్‌ అభిమానులకు నిరాశ.. నిర్మాణ సంస్థల కీలక ప్రకటన..!

Pawan Kalyan Birthday: పవన్ కళ్యాణ్‌.. ఈ పేరే ఓ సంచలనం. తనదైన మేనరిజం, అద్భుత నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు పవర్‌ స్టార్‌ పవన్‌. ఇప్పుడు రాజకీయాల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకొని ప్రజా సేవలో దూసుకుపోతున్నారు. ఇక ఈరోజు (సెప్టెంబర్‌ 2) పవన్ అభిమానులకు పండగ రోజు. పవర్‌ స్టార్‌ పుట్టిన రోజును అభిమానులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుందా అనుకున్నారు.

చిత్ర నిర్మాణ సంస్థలు సైతం అందుకు అనుగుణంగానే కొత్త సినిమాలకు సంబంధించి అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేయనున్నట్లు ప్రకటనలు సైతం చేశాయి. అయితే తాజాగా పవన్ అభిమానులకు నిరాశే ఎదురైంది. పవన్‌ సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్‌ విడుదల చేయడం లేదంటూ నిర్మాణ సంస్థలు ఓ ప్రకటన విడుదల చేశాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో నేడు విడుదల కావాల్సిన అప్‌డేట్స్‌ను క్యాన్సిల్‌ చేస్తున్నట్లు తెలిపాయి. ప్రజలు వరదల కారణంగా ఇబ్బంది పడుతున్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

సుజీత్‌ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ సోమవారం విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఇది వరకు ప్రకటించింది. అయితే ‘ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందుకు పడుతున్నారని, వరదల కారణంగా బర్త్‌డే కంటెంట్‌ రిలీజ్‌ను రద్దు చేస్తున్నామని స్పష్టం చేశారు. అయితే 'ఓజీ’ సినిమా కొన్నేళ్ల పాటు సెలబ్రేట్‌ చేసుకునేలా ఉంటుందని, ఈ విపత్కర పరిస్థితులను అధిగమించి.. త్వరలోనే భారీ సెలబ్రేషన్స్‌ చేసుకుందాం’ అని చిత్ర యూనిట్ ప్రకటన చేసింది.

ఇక పవన్ హీరోగా తెరకెక్కుతోన్న మరో చిత్రం ‘హరిహర వీరమల్లు’ చిత్ర యూనిట్ సైతం కొత్త పోస్టర్‌ విడుదలను క్యాన్సిల్ చేసింది. ‘పవన్‌ ఫ్యాన్స్‌ కోసం ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ డిజైన్‌ చేశామని, ఈరోజు రిలీజ్‌ చేద్దామని అనుకున్నాని తెలిపారు. కానీ ప్రస్తుతం తీవ్రమైన వరదలతో తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలో పోస్టర్‌ రిలీజ్‌ చేయడం సరికాదని భావిస్తున్నాం. అందరూ అర్థం చేసుకొని మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం అంటూ చిత్ర యూనిట్ ప్రకటన విడుదల చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story