logo
సినిమా

Pawan Kalyan: డబ్బింగ్ కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్

Dubbing Completed by Pawan Kalyan
X

Pawan Kalyan: డబ్బింగ్ కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్

Highlights

Pawan Kalyan: ఈ మధ్యనే "వకీల్ సాబ్" సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు "భీమ్లా నాయక్" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Pawan Kalyan: ఈ మధ్యనే "వకీల్ సాబ్" సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు "భీమ్లా నాయక్" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషియుమ్" అనే సినిమాకి ఈ చిత్రం రీమేక్గా తెరకెక్కుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేశారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న చిత్రబృందం సినిమాని ఈనెల 25 వ తారీకున విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే సినిమా ట్రైలర్ ను త్వరలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.

అతి త్వరలోనే ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ పనులు ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ పూర్తి చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. రానా కూడా హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నిత్యామీనన్ మరియు సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.

Web TitleDubbing Completed by Pawan Kalyan
Next Story