Drushyam 2: 'దృశ్యం 2' రిలీజ్ డేట్.. 'నారప్ప' డిసైడ్ చేస్తాడంటా?

Drushyam 2 Release date: Long delay expected!
x

విక్టరీ వెంకటేష్ (ఫొటో హన్స్ ఇండియా)

Highlights

Drushyam 2: సూపర్ హిట్ చిత్రం 'దృశ్యం' సీక్వెల్ లో వెంకటేష్, మీనా తిరిగి తమ పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.

Drushyam 2: సూపర్ హిట్ చిత్రం 'దృశ్యం' సీక్వెల్ లో వెంకటేష్, మీనా తిరిగి తమ పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే 'దృశ్యం 2' సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ జరుగుతున్న తీరుతో ఫిల్మ్ యూనిట్ చాలా సంతోషంగా ఉంది. త్వరలో కేరళలో కొత్త షెడ్యూల్ జరగనుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది.

రెండు నెలల్లో ఈ చిత్రం రెడీ అవుతుందని మేకర్స్ పేర్కొన్నారు. కానీ, విడుదల మాత్రం ఈ ఏడాది చివరకు అయ్యేలా ఉందని తెలుస్తోంది. నారప్ప, ఎఫ్ 3 సినిమా విజయాలపై 'దృశ్యం 2' విడుదల ఆధారపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నారప్ప మే నెలలో, ఎఫ్ 3 ఆగస్టులో విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే, నారప్ప విజయవంతమైతే, ఎఫ్ 3 సినిమా విడుదలకు ముందే 'దృశ్యం 2' విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది.

ఒకవేళ నారప్ప ఫెయిల్ అయితే, అనుకున్న ప్రణాళికల మేరకు ఎఫ్ 3 విడుదల అవుతుంది. ఆ తరువాత అంటే ఈ ఏడాది చివర్లో 'దృశ్యం 2' రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి దృశ్యం 2 సినిమా విడుదల నారప్ప సినిమా డిసైడ్ చేయడంతో విక్టరీ ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారని సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories