Drishyam 2: ప్రీక్వెల్ నటులతోనే సీక్వెల్.. వెంకీ మామా సందడి షురూ..

Drishyam 2: ప్రీ-రిలీజ్ లాంటి సంచలనాలు లేకుండా మళయాలంలో మోహన్ లాల్, మీనా నటించిన 'దృశ్యం 2' ఓటీటీలో రిలీజ్ అయింది.

Venkata Chari
Published on: 18 March 2021 3:10 PM IST
Drishyam 2 Shoot Location Photos Viral on the Internet
X

దృశ్యం 2 సెట్ లో నటీనటులు (ఫొటో ట్విట్టర్)

Drishyam 2: ప్రీ-రిలీజ్ లాంటి సంచలనాలు లేకుండా మళయాలంలో మోహన్ లాల్, మీనా జంటగా నటించిన 'దృశ్యం 2' ఓటీటీలో (OTT) రిలీజ్ అయింది. అలాగే ప్రేక్షకుల నుంచి కూడా అద్భుతమైన స్పందన పొందింది ఈ సినిమా. 'దృశ్యం', సీక్వెల్ గా వచ్చిన 'దృశ్యం 2' కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది.

జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులోనూ రీమేక్ చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈమధ్యే షూటింగ్ ప్రారంభించిన ఈ మూవీ నుంచి కొన్ని ఫొటోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. వెంకీ, మీనా నటించబోయే ఈ చిత్రంలో 'దృశ్యం 2 ' పై కూడా అంచనాలు హైరేంజ్ లో ఉన్నాయి.

ఊహించిన విధంగానే ప్రీక్వెల్ లో నటించిన వారే సీక్వెల్ లోనూ కనిపించనున్నారు. వెంకటేష్, మీనా సీక్వెల్ లోనూ తమ పాత్రలను తిరిగి పోషిస్తున్నారు. మొదటి భాగంలో భాగమైన కృతికా జయకుమార్, ఎస్తేర్ అనిల్ కూడా వెంకటేష్ కుమార్తెల పాత్రలో జాయిన్ అయ్యారు.

వరుణ్ తల్లిదండ్రుల పాత్రల్లో నటించిన నదియా, నరేష్ ఈ సీక్వెల్ లో కూడా కొనసాగనున్నారు. ప్రముఖ నటుడు సంపత్ రాజ్ ఈ చిత్రంలో ఐజీ పాత్రను పోషించనున్నట్లు తెలుస్తోంది.

Venkata Chari

Venkata Chari

Next Story