'మహర్షి' లో మీనాక్షి పాత్ర ఇదేనా

మహర్షి లో మీనాక్షి పాత్ర ఇదేనా
x
Highlights

ఈ మధ్యనే 'భరత్ అనే నేను' సినిమా బ్లాక్బస్టర్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'మహర్షి' సినిమాతో ప్రేక్షకులముందుకు వస్తున్న సంగతి...

ఈ మధ్యనే 'భరత్ అనే నేను' సినిమా బ్లాక్బస్టర్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'మహర్షి' సినిమాతో ప్రేక్షకులముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్ లో 25 వ చిత్రంగా మే 9న విడుదల కానుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో మీనాక్షి దీక్షిత్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతోంది అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఈ మీనాక్షి దీక్షిత్ ఎవరు అంటే ఆమె మహేష్ బాబు బ్లాక్ బస్టర్ సినిమా 'దూకుడు'లో టైటిల్ సాంగ్ లో మెరిసింది ఈ భామ.

తాజాగా 'మహర్షి' సినిమాలో అమెరికాలో మహేష్ బాబు కొలీగ్ పాత్రలో కనిపించబోతోంది అని వార్తలు బయటకు వస్తున్నాయి. అంతేకాక మహేష్ కి మీనాక్షి కి మధ్య రొమాన్స్ కూడా ఉండబోతోందని, అది ఏ రేంజిలో ఉండబోతోందో తెలియాలంటే సినిమా చూడాలని ఫిల్మ్ నగర్ లో పుకార్లు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు తో పనిచేయడం సూపర్ ఎక్స్పీరియన్స్ అని మహేష్ బాబు ప్రొఫెషనలిజం కి మారుపేరు అని చెప్పుకొచ్చింది మీనాక్షి. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories