OTT Movie: ఈ డోర్‌ను రెండుసార్లు కొడితే నరకం తలుపు తెరుచుకుంటుంది… చూడాలంటే హనుమాన్ చాలీసా చేతిలో ఉండాల్సిందే!

OTT Movie: ఈ డోర్‌ను రెండుసార్లు కొడితే నరకం తలుపు తెరుచుకుంటుంది… చూడాలంటే హనుమాన్ చాలీసా చేతిలో ఉండాల్సిందే!
x

OTT Movie: ఈ డోర్‌ను రెండుసార్లు కొడితే నరకం తలుపు తెరుచుకుంటుంది… చూడాలంటే హనుమాన్ చాలీసా చేతిలో ఉండాల్సిందే!

Highlights

రెండుసార్లు ఒక పాడుబడిన ఇంటి తలుపు కొడితే నరకం తలుపు తెరుచుకుంటుందట. ఆ తలుపు వెనక దాగి ఉన్నది ఓ డెమోనిక్ బాబా యాగా. వణికించే హారర్ థ్రిల్లర్ కోసం సిద్ధంగా ఉన్నవారికి తప్పకుండా చూడాల్సిన సినిమా – Don’t Knock Twice.

రెండుసార్లు ఒక పాడుబడిన ఇంటి తలుపు కొడితే నరకం తలుపు తెరుచుకుంటుందట. ఆ తలుపు వెనక దాగి ఉన్నది ఓ డెమోనిక్ బాబా యాగా. వణికించే హారర్ థ్రిల్లర్ కోసం సిద్ధంగా ఉన్నవారికి తప్పకుండా చూడాల్సిన సినిమా – Don’t Knock Twice. ఈ సినిమా చూస్తుంటే హనుమాన్ చాలీసా చేతిలో పెట్టుకుని చూడాల్సిందే!

కథా సారాంశం

ఈ కథ వేల్స్ ప్రాంతంలో చోటుచేసుకుంటుంది. జెస్ (కేటీ సాక్‌హాఫ్) అనే ఒక అమెరికన్ స్కల్ప్టర్ మాదకద్రవ్యాలకు బానిసగా ఉండి, తన కూతురు క్లోయిని కోల్పోయింది. ఇప్పుడు ఆమె క్లోయిని మళ్లీ పొందాలనుకుంటుంది. కానీ క్లోయి, తల్లి పట్ల కోపంతో ఉంటుంది.

ఒకరోజు క్లోయి తన స్నేహితుడు డానీతో కలిసి ఒక పాడుబడిన ఇంటికి వెళ్తుంది. అక్కడ స్థానిక నమ్మకాల ప్రకారం… ఒక వృద్ధురాలు మేరీ అమినోవ్ డీమాన్ "స్లేవ్"తో కలిసి జీవించేదట. ఆ ఇంటి తలుపును రెండు సార్లు కొడితే, ఆ దెయ్యం మేలుకొంటుందట. అనుకోకుండా తలుపు రెండుసార్లు కొట్టడంతో కథ భయంకరంగా మలుపుతీసుకుంటుంది. డానీ అదృశ్యమవుతాడు… క్లోయి పీడకలలతో బాధపడుతుంది.

బాబా యాగా - భయపెట్టే వైల్డ్ కార్డ్

కథలో ప్రధాన భూతం బాబా యాగా – ఓ స్లావిక్ లెజెండరీ విచ్. జెస్, క్లోయిని రక్షించేందుకు ఆమె రాజ్యంలోకి అడుగుపెడుతుంది. కానీ అక్కడ అసలు షాకింగ్ ట్విస్ట్ ఎదురవుతుంది! ఆమె స్నేహితురాలు టిరా కూడా బాబా యాగా వశమైపోయిందని, డిటెక్టివ్‌ను బలిగా ఇచ్చేందుకు కుట్ర చేస్తున్నదని తెలుస్తుంది.

నటీనటులు & స్ట్రీమింగ్

టైటిల్: Don’t Knock Twice (2017)

దర్శకుడు: కారడాగ్ డబ్ల్యూ. జేమ్స్

నటీనటులు: కేటీ సాక్‌హాఫ్, లూసీ బాయింటన్, జావియర్ బోటెట్, పూనెహ్ హాజీమొహమ్మది

ప్రస్తుతం స్ట్రీమింగ్: Amazon Prime Video

భాషలు: ఇంగ్లీష్ (తెలుగు, హిందీ, తమిళం సబ్‌టైటిల్స్‌తో)

చూస్తే భయంతో కంపించేస్తుంది!

ఈ హారర్ థ్రిల్లర్ స్పooky visuals, క్రీపీ సౌండ్ ఎఫెక్ట్స్‌తో భయాన్ని రెట్టింపు చేస్తుంది. 'డోంట్ నాక్ ట్వైస్' సినిమా చూసే ముందు లైట్స్ ఆఫ్ చేయకండి… కానీ ఒక్కసారి స్టార్ట్ చేస్తే, చివరి వరకు కుర్చీలో కదలకుండా ఉంచుతుంది!

Show Full Article
Print Article
Next Story
More Stories