Valimai: "వలిమై" సన్నివేశాలను అక్కడి నుంచి కాపీ చేశారా?

Does Valimai Movie scene Copy
x

Valimai: "వలిమై" సన్నివేశాలను అక్కడి నుంచి కాపీ చేశారా? 

Highlights

Valimai: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా నటించిన "వలిమై" ఈ మధ్యనే తెలుగు తమిళ భాషల్లో భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది.

Valimai: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా నటించిన "వలిమై" ఈ మధ్యనే తెలుగు తమిళ భాషల్లో భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. తమిళంలో ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నప్పటికీ తెలుగులో మాత్రం ఈ సినిమాకి అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు. ఈ మధ్యనే విడుదలైన పవన్ కళ్యాణ్ " భీమ్లా నాయక్" సినిమా మంచి హిట్ అవడంతో తెలుగు ప్రేక్షకులు "వలిమై" సినిమాని పట్టించుకోవటం లేదు. అయితే టాలీవుడ్ హీరో కార్తికేయ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించారు. సినిమా అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ విలన్ పాత్ర వైవిధ్యంగా ఉంది అంటూ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.

అయితే తాజాగా ఇప్పుడు "వలిమై"లోని ఆక్షన్ సన్నివేశాలన్నీ జాకీచాన్ సినిమా ఆధారంగా తెరకెక్కించారు అంటూ కొందరు వేలెత్తి చూపిస్తున్నారు. ఫోర్ లో జాకీ చాన్ స్వయంగా నిర్మించిన "ది న్యూ పోలీస్ స్టోరీ" అనే సినిమా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం ట్రైలర్ యూట్యూబ్ లో కూడా ఉంది. ఇక ఈ సినిమా చూసిన వారందరూ "వలిమై" లోని ఆక్షన్ సన్నివేశాలను ఈ చిత్ర ఆధారంగానే తీశారు అంటూ చెబుతున్నారు. ముఖాలకి మాస్కులు వేసుకుని బైకుల మీద వెళుతూ క్రైమ్స్ చేసే విలన్ గ్యాంగ్ ఈ రెండు సినిమాలకీ మధ్య ఉండే ముఖ్యమైన కామన్ పాయింట్ గా చెప్పుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories