Srikanth Odela: "దసరా" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఎవరితోనో తెలుసా..

Srikanth Odela: అక్కినేని హీరో తో "దసరా" డైరెక్టర్

Jyothi
Published on: 8 April 2023 1:23 PM IST
Do you Know who the Director of Dasara is with in his Next Film?
X

Srikanth Odela: "దసరా" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఎవరితోనో తెలుసా..

Srikanth Odela: నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెలా అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కాక శ్రీకాంత్ పేరు ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం బాగానే వినిపిస్తోంది. హిందీలో సినిమా పెద్దగా ఆడకపోయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి భారీ కలెక్షన్లు లభించాయి. మొదటి సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో శ్రీకాంత్ ఓదెలాకి ఇప్పుడు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.

ఇక శ్రీకాంత్ తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేయబోతున్నారు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ఒక యువ హీరోతో శ్రీకాంత్ ఓదెల ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే హీరోగా పరిచయమై చాలాకాలం అయినప్పటికీ అఖిల్ అక్కినేని కరియర్లో ఇప్పటిదాకా ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేదు. ఈ మధ్యనే "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమాతో పర్వాలేదు అనిపించిన అఖిల్ ఇప్పుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమాతో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా ఈనెల 28వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదలైన తరువాత అఖిల్ శ్రీకాంత్ ఓదేలని కలిసి స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ డైరెక్టర్ సుధాకర్ చెరకూరి ఈ సినిమాని నిర్మించనున్నారు. దసరా సినిమాని కూడా సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో శ్రీకాంత్ మీద ఉన్న నమ్మకంతో సుధాకర్ చెరుకూరి మళ్లీ శ్రీకాంత్ దర్శకత్వంలో సినిమాని నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Jyothi

Jyothi

Next Story