తమన్ రింగ్ టోన్ ఏ హీరో దో తెలుసా?

Thaman: విజయ్ పాటని రింగ్ టోన్ గా పెట్టుకున్న తమన్

Jyothi
Published on: 10 Feb 2023 2:39 PM IST
Do you know which Hero is the Ringtone of Thaman?
X

తమన్ రింగ్ టోన్ ఏ హీరో దో తెలుసా?

Thaman: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎస్ఎస్ తమన్ పేరు ముందే ఉంటుంది. సంవత్సరానికి పది పన్నెండు సినిమాలకు సంగీతాన్ని అందిస్తూ స్టార్ హీరో సినిమా అనగానే సంగీత దర్శకుడిగా తన పేరే ముద్ర వేయించుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు తమన్. ఈ మధ్యనే సంక్రాంతి సందర్భంగా విడుదలైన వారసుడు, వీర సింహారెడ్డి సినిమాలకు కూడా సంగీతాన్ని అందించిన తమన్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #ఆర్సి15 మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న #ఎస్ఎస్ఎంబి 28 సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఎన్నో వందల పాటలకు సంగీతాన్ని అందించిన తమన్ తాజాగా విజయ్ సినిమాలలో తన ఫేవరెట్ సినిమా గురించి చెప్పుకొచ్చారు. "తలపతి విజయ్ సినిమాల నేపథ్య సంగీతాలలో నాకు మాస్టర్ సినిమా బిజిఎం చాలా ఇష్టం దానిని నేను నా రింగ్టోన్ గా కూడా పెట్టుకున్నాను. విజయ్ సర్ పాటలలో నాకు నచ్చిన పాట "పోక్కిరి" సినిమా నుంచి "అడుంగడ ఎన్న సుత్తి". నేను ఆ సినిమాలో పని చేశాను.

పతి పతి తలపతి రాప్ కి కూడా లిరిక్స్ రాశాను," అని అన్నారు తమన్. ఇక విజయ్ మరియు తమన్ కాంబినేషన్ లో కూడా ముందు ముందు చాలా అదిరిపోయే పాటలు బయటకు రావాలని అభిమానులు చెబుతున్నారు. ఈ మధ్యనే "వారసుడు" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీరిద్దరి కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుందో చూడాలి.

Jyothi

Jyothi

Next Story