Jr NTR: ఎన్టీఆర్ ఆస్తులు విలువ ఎంతో తెలుసా?

Do You Know the Value of Jr NTR Assets
x

Jr NTR: ఎన్టీఆర్ ఆస్తులు విలువ ఎంతో తెలుసా?

Highlights

Jr NTR Assets: ఒక్కో సినిమాకి తన క్రేజ్ ని పెంచుకుంటూ వస్తున్నారు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.

Jr NTR Assets: ఒక్కో సినిమాకి తన క్రేజ్ ని పెంచుకుంటూ వస్తున్నారు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో ఎన్టీఆర్ ఇప్పుడు పెద్ద స్టార్ గా మారిపోయారు. ఇక టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోలలో ఎన్టీఆర్ పేరు కూడా వినిపిస్తోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఆస్తుల విలువ 70 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో చూసుకుంటే సుమారు 571 కోట్లు అని తెలుస్తోంది.

ఇక నెలకి ఎన్టీఆర్ 3 కోట్ల దాకా సంపాదిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సినిమాల పరంగా కూడా ఎన్టీఆర్ భారీ రెమ్యూనరేషన్లు తీసుకుంటున్నారు. ఒక్కో సినిమాకి ఎన్టీఆర్ 12 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునేవారు. కానీ "అర్ఆర్ఆర్" సినిమాకి ఎన్టీఆర్ ఏకంగా 45 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట. ఇక ఈ సినిమా ఇప్పుడు భారీగా బ్లాక్ బస్టర్ అయ్యి ఆస్కార్ కూడా అందుకోవడంతో ఎన్టీఆర్ మార్కెట్ బీభత్సంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తన రెమ్యూనరేషన్ ని కూడా భారీగానే పెంచేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఒక్కో సినిమా కి తారక్ 60 నుంచి 80 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ వల్ల నిర్మాతలు కూడా ఎన్టీఆర్ ఎంత అడిగితే అంత ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో 25 కోట్లు విలువ చేసే ఒక బంగ్లాలో తన కుటుంబంతో నివసిస్తున్నారు. హైదరాబాద్ లో మాత్రమే కాక బెంగళూరులో కూడా ఎన్టీఆర్ కి బాగానే ఆస్తులు ఉన్నాయట. అంతేకాకుండా ఎన్టీఆర్ వద్ద లాంబోర్గిని, రేంజ్ రోవర్, పోర్షే, మెర్సిడెస్ బెంజ్, వంటి కోట్లు విలువ చేసే కార్లు కూడా ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories