Pawan Kalyan: 'వకీల్ సాబ్' బెనిఫిట్ షో టిక్కెట్ ధర ఎంతో తెలుసా!

Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల్లో అధికారికంగా వకీల్ సాబ్ బెనిఫిట్ షో టిక్కెట్ ధరలు భారీగా పెరగనున్నట్లు సామాచారం.

Kranthi
Updated on: 30 March 2021 7:43 AM IST
Do You Know the Ticket Price of Vakil Saab Benefit Show?
X

Pawan Kalyan:(ఫైల్ ఇమేజ్)

Pawan Kalyan: ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న పవన్ కళ్యాణ్ నటిస్తోన్న వకీల్ సాబ్ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ తో భారీ క్రేజ్ సంపాదించుకుని అంచానాలు పెంచేసింది. పవన్ కు ఉన్న ఫాలోయింగ్ వల్ల ఇప్పటికే ఈ చిత్రం భారీగా ప్రీరిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం.

మరోవైపు ఈ సినిమాకు అమెరికా సహా అన్ని చోట్ల బెనిఫిట్ షోలను చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అధికారికంగా బెనిఫిట్ షో టికెట్ ధరను రూ. 1500గా నిర్ణయించాలని భావిస్తున్నారట. ఏపీలో విడుదలకు ముందు రోజు రాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షో వేసేలా అనుమతులు తీసుకున్నారట. తెలంగాణలో మాత్రం సినిమా విడుదలయ్యే ఏప్రిల్ 9న ఉదయం 6 గంటలకు బెనిఫిట్ షో వేయనున్నట్టు సమాచారం. అంతేకాదు, ఈ సినిమా టికెట్ రేట్లను పెంచేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని సమాచారం. దీనికి సంబంధించి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే జీవోలను జారీ చేశాయి. దీంతో టికెట్ ధర రూ. 300 నుంచి రూ. 500 మధ్య ఉండవచ్చని తెలుస్తోంది.

Kranthi

Kranthi

Next Story