విక్రమ్ మేకప్ కోసం ఎన్ని గంటలు పడుతుందో తెలుసా?

Do You Know How Many Hours It Takes For Vikram Make Up
x

విక్రమ్ మేకప్ కోసం ఎన్ని గంటలు పడుతుందో తెలుసా?

Highlights

* విక్రమ్ కోసం అన్ని గంటలు మేకప్ వేస్తున్న బృందం

Vikram: విభిన్న పాత్రలు చేయటం లో కమల్ హాసన్ తర్వాత అంతే రిస్కీ మరియు ఎక్స్పరిమెంటల్ పాత్రలు చేయడంలో ముందుంటారు చియాన్ విక్రమ్. తన పాత్ర కోసం ఎలాంటి మేకోవర్ కి అయినా విక్రమ్ నో చెప్పరు. "శివ పుత్రుడు" సినిమా నుండి "ఐ" దాకా విక్రమ్ ట్రై చేసిన రిస్కీ పాత్రలు ఇండస్ట్రీలో మరే హీరో కూడా చేయలేరు. ఎలాంటి ఛాలెంజింగ్ పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోగల టాలెంట్ ఉన్న నటుడు విక్రమ్. తాజాగా ఇప్పుడు విక్రమ్ "తంగాలన్" అనే ఒక పీరియాడిక్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.

పా రంజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్యాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషలలో భారీ స్థాయిలో ఈ సినిమా విడుదల కి సిద్ధమవుతోంది. స్వతంత్రానికి ముందు కే జి ఎఫ్ లో నారాచీ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ ఇది. 1800 సంవత్సరంలో నరాచీ ప్రాంతంలో దళితులపై జరిగిన మారణ కాండ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండబోతోంది. ఈ మధ్యనే విడుదల అయిన టీజర్ కూడా సినిమాపై అంచనాల్ని పెంచేసింది అని చెప్పుకోవచ్చు. గిరిజన తెగకు చెందిన వ్యక్తిగా విక్రమ్ ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమాలో విక్రమ్ బారుగడ్డం, గోచి లాంటి వేషధారణలో కనిపించబోతున్నారు. చేతిలో కత్తి, ముక్కు చెవికి పోగులతో విభిన్న మేకోవర్ తో కనిపించిన విక్రమ్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు.

అయితే ఈ క్యారెక్టర్ మేకోవర్ కి సంబంధించిన మేకప్ కోసం విక్రమ్ కు దాదాపు 4 గంటలు పడుతోందట. స్టూడియో గ్రీన్ బ్యానర్ పతాకంపై కె.ఇ. జ్ఞానవేళ్ రాజా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పార్వతీ మీనన్ మరియు మాళవికా మోహనన్ ఈ సినిమా లో హీరోయిన్ లుగా నటిస్తున్నారు. పశుపతి కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories