Shruti Marathe Biography: ‘దేవర’కు జోడిగా నటించిన శృతి మరాఠి ఎవరో తెలుసా.? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..

Shruti Marathe Biography: శృతి మరాఠీ... గుజరాత్ కి చెందిన అమ్మాయి. ఈమె హిందీ సినిమాల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 25 Sept 2024 7:53 PM IST
Shruti Marathe Biography
X

Shruti Marathe Biography: ‘దేవర’కు జోడిగా నటించిన శృతి మరాఠి ఎవరో తెలుసా.? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..

Shruti Marathe Biography: మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది దేవర మూవీ. ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు అనుగుణంగానే ఈ సినిమాను కొరటాల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

కాగా ఈ సినిమాలో తండ్రి, కొడుకుల పాత్రల్లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. దేవర, వర అనే రెండు పాత్రల్లో ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. 'వర'కు జంటగా జాన్వీ కపూర్ కనిపిస్తుండగా ‘దేవర’కు జంటగా శృతి మరాఠి నటించింది. దీంతో అందరి దృష్టి ఈ శృతిపై పడింది. తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్న ఈ శృతి ఎవరో తెలుసుకోవాలని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంతకీ ఎవరీ శృతి, ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

శృతి మరాఠీ... గుజరాత్ కి చెందిన అమ్మాయి. ఈమె హిందీ సినిమాల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది. గతంలో తమిళ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. శృతి మరాఠి కొన్ని హిందీ సీరియల్స్ లో కూడా కనిపించింది. తాజాగా పలు వెబ్ సీరీస్ లలో కూడా నటిస్తూ సందడి చేస్తోంది. ఇక ఈమె వ్యక్తిగత జీవితానికి వస్తే.. గౌరవ్ ఘటనేకర్ అనే నటుడిని 2016 లో పెళ్లి చేసుకుంది.

తాజాగా దేవరతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో శృతి.. రెండు షేడ్స్ ఉన్న పాత్రాల్లో కనిపించునుంది. ఎన్టీఆర్ చేసే తండ్రి పాత్రకు భార్యగా, కొడుకు పాత్రకు తల్లిగా నటించనుంది. ఈ పాత్రకు ఒక ఫ్రెష్ ఫేస్, ఎక్కువ అంచనాలు లేని నటిని తీసుకోవాలనుకున్నాం అందుకే శృతి మరాఠిని తీసుకున్నాం కొరటాల శివ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వులో తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story