అదిరింది షోలో చమ్మక్ చంద్ర పక్కన కనిపించే ఈమె ఎవరో తెలుసా ?

అదిరింది షోలో చమ్మక్ చంద్ర పక్కన కనిపించే ఈమె ఎవరో తెలుసా ?
x
Highlights

ప్రముఖ ఛానల్ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ కామెడీ షో ఎంత పెద్ద హిట్టయిందో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు.

ప్రముఖ ఛానల్ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ కామెడీ షో ఎంత పెద్ద హిట్టయిందో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. మొదట్లో కేవలం జబర్దస్త్ తో ప్రసారం అయిన ఈ షో మంచి టాక్ ని , టీఆర్పీని సంపాదించుకొని ఎక్స్ ట్రా జబర్దస్త్ ను కూడా మొదలుపెట్టి దూసుకుపోతుంది. గురువారం, శుక్రవారం వచ్చే ఈ షో అంటే బుల్లితెర ప్రేక్షకులు కూడా మంచి ఆసక్తిని చూపిస్తున్నారు.

ఈ షో ద్వారా పరిచయం అయిన హాస్యనటులు ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్ గా నటిస్తున్నారు. ఇంకొందరు ఏకాంగా హీరోలే అయ్యారు. అలా పేరు సంపాదించుకున్న హాస్యనటులలో చమ్మక్ చంద్ర ఒకడు. ఎక్కువగా ఆడవాళ్ళ మీదా స్కిట్స్ చేస్తూ అందరిని నవ్విస్తుంటాడు చంద్ర..

ఇది ఇలా అతని స్కిట్ లో ఓ లేడి కనిపిస్తూ ఉంటుంది. ఆమె ఎవరు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. నిజానికి ఆమె సినీ ఇండస్ట్రీలో చాలా మందికి చాలా అరుదుగా తెలుసు. ఆమె పేరు సత్య శ్రీ.. ఆమె ఈ షోతో పాటు కొన్ని సినిమాల్లో కూడా కనిపించింది. రవితేజ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన రాజా ది గ్రేట్, పాయల్ రాజ్ పుత్ మెయిన్ లీడ్ లో నటించిన ఆర్ డీ ఎక్స్ లవ్ సినిమాలో నటించింది. చేసింది చిన్న పాత్ర కాబట్టి పెద్దగా గుర్తింపు అయితే రాలేదని చెప్పాలి.

జబర్దస్త్ షో తోనే ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకుంది సత్య శ్రీ.. ఇప్పుడు అదే చమ్మక్ చంద్రతో అదిరింది షోలో చేస్తుంది సత్య శ్రీ.. ప్రస్తుతం ఆమె కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఎంత మంచివాడవురా సినిమాలో ఓ చిన్న పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాని సంక్రాంతి పండగకి కానుకగా జనవరి 15 న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన మేహ్రీన్ కథానాయకగా నటించింది. పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories