Kodi Divya Deepti: కోడి వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న దివ్య దీప్తి

Kodi Divya Deepti: దర్శకురాలిగా కూడా మారతాను అంటున్న కోడి రామకృష్ణ వారసురాలు

Jyothi
Published on: 15 Sept 2022 8:05 AM IST
Divya Deepti is Going to be Introduced to the Industry as Kodi Successor
X

Kodi Divya Deepti: కోడి వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న దివ్య దీప్తి 

Kodi Divya Deepti: దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ వారసురాలిగా కోడి దివ్య దీప్తి అతి త్వరలోనే నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది. దర్శకుడిగా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన రామకృష్ణ తన పిల్లలను మాత్రం ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. కానీ ఇప్పుడు ఆయన వారసత్వాన్ని కొనసాగించడానికి ముందుకు వచ్చింది ఆయన కూతురు దివ్య దీప్తి. మంచి సినిమా నిర్మించాలని కోరిక తనకు ఎప్పటినుంచో ఉందని కానీ అది బోలెడు సవాలతో కూడుకున్నది అనే విషయాన్ని అని చెప్పుకొచ్చింది దివ్య దీప్తి.

సవాళ్లు కూడా ఒక అనుభవంలా ఉండాలని నేను అన్ని నేర్చుకుంటూ నా ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాను. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమా ఉంటుంది. కథ విషయంలో నాకంటూ ఒక ప్రత్యేకమైన అభిరుచి ఉంది. నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. భవిష్యత్తులో భారీ బడ్జెట్ సినిమాలు కూడా నిర్మిస్తాను. మంచి కథలు దొరికితే వాటికోసం ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టడానికి వెనుకాడను. ఇండస్ట్రీ బిడ్డగా అది నా బాధ్యత అని నేను భావిస్తున్నాను. నిర్మాతగానే కాదు దర్శకురాలిగా కూడా రాణించాలని నా కోరిక. చిన్నతనం నుంచి దర్శకత్వం పై ఇష్టం ఉంది. ఇప్పటికే మూడు నాలుగు కథలు కూడా రాశాను. భవిష్యత్తులో అవి తెరకెక్కిస్తాను. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో కూడా చాలానే మార్పులు వచ్చాయి. కొత్త కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు అని చెప్పుకొచ్చింది దివ్య దీప్తి. మరి తన తండ్రికి తగ్గ వారసురాలిగా ఆమె ఎంతవరకు ఇండస్ట్రీలో రాణిస్తుందో వేచి చూడాలి.

Jyothi

Jyothi

Next Story