నిర్మాతల పై ఒత్తిడి తెస్తున్న డిస్ట్రిబ్యూటర్లు

నిర్మాతల పై ఒత్తిడి తెస్తున్న డిస్ట్రిబ్యూటర్లు

admin1
Updated on: 8 Jan 2022 7:30 PM IST
Distributors Putting Pressure on Film Producers | Telugu Movie News
X

నిర్మాతల పై ఒత్తిడి తెస్తున్న డిస్ట్రిబ్యూటర్లు

Film Producers-Distributers: ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "ఆర్ఆర్ఆర్". కానీ ఈ సినిమా విడుదల చేయాలని ఎప్పుడూ అనుకున్నా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. అయితే గత ఏడాది జూలైలో విడుదల కావాల్సిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ ఏడాది జనవరిలో విడుదల అవుతుంది. మళ్ళీ ఇప్పుడు అది కూడా వాయిదా పడింది. ఇక ఈ సినిమాని అనుకున్న సమయానికి విడుదల చేయడం చిత్ర బృందానికి ఒక పెద్ద సవాలుగా మారింది. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడటంతో ఇప్పుడు పంపిణీదారులు నుండి నిర్మాతలకి తీవ్ర ఒత్తిడి ఉందని సమాచారం.

విడుదల సంకేతాలు కూడా లేకపోవడంతో కొనుగోలుదారులు నుండి నిర్మాతలకి భారీ ఒత్తిడి ఉంటుంది. ఇప్పటికే భారీ అడ్వాన్సులు చెల్లించిన డిస్ట్రిబ్యూటర్లు అడ్వాన్సు తిరిగి ఇవ్వాలని కూడా కోరుతున్నారు. ఇక సంక్రాంతి బరిలో నుండి తప్పుకున్న "రాధే శ్యామ్" సినిమా పరిస్థితి కూడా అలానే ఉంది. ఇక సినిమా కోసం ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల సంగతైతే చెప్పనక్కర్లేదు. డిస్ట్రిబ్యూటర్ లతోపాటు అభిమానులు సైతం నిర్మాతలను సోషల్ మీడియా ద్వారా ప్రెజర్ చేస్తూ ఉంటారు. అయితే "ఆర్ఆర్ఆర్" విడుదల గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది అని తెలుస్తోంది.

admin1

admin1

Next Story