Charmy Kaur: భర్తీ చేయడానికి డబ్బులు లేవు అంటూ ప్లేటు ఫిరాయిస్తున్న చార్మి

Charmy Kaur: డిస్ట్రిబ్యూటర్లు ఒకటి చెప్తుంటే మరొకటి చెబుతున్న చార్మి

Jyothi
Updated on: 13 Sept 2022 1:30 PM IST
Distributors Are Saying one thing And Charmy is Saying Another
X

Charmy Kaur: భర్తీ చేయడానికి డబ్బులు లేవు అంటూ ప్లేటు ఫిరాయిస్తున్న చార్మి 

Charmy Kaur: విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఈ మధ్యనే విడుదలైన సినిమా "లైగర్" భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా వల్ల చిత్ర నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సౌత్ ఇండియన్ రైట్స్ మొత్తాన్ని వరంగల్ శ్రీను 90 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ శ్రీనుకి భారీ మొత్తంలో నష్టాలు కూడా ఎదురయ్యాయి.

అయితే మరోవైపు చిత్ర నిర్మాత పూరి జగన్నాథ్ మరియు చార్మి మాత్రం మరొక కథ చెబుతున్నారు. సినిమా వల్ల తమకు మరియు డిస్ట్రిబ్యూటర్ల కి కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చాయని చెబుతున్నారు. ఇక డిస్ట్రిబ్యూటర్లకు మరియు ఎగ్జిబిటర్లకు కలిగిన నష్టాన్ని భర్తీ చేసిన తర్వాత కూడా నిర్మాతలు ప్రాఫిట్ లోనే ఉన్నట్లు కొందరు చెబుతున్నారు.

కానీ చార్మి మాత్రం తమ దగ్గర భర్తీ చేయడానికి కూడా డబ్బులు లేవని సినిమా కోసం భారీ బడ్జెట్లో యాక్టర్లకు ఇచ్చిన రెమ్యూనరేషన్ వల్ల తమ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం అయిపోయాయని వాదిస్తోంది. అయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ చార్మి డబ్బులు ఇచ్చి తీరాల్సిందేనని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తమ నష్టాన్ని భర్తీ చేయాలని డిస్టర్బ్యూటర్లు చెబుతున్నారు. మరి ఈ సమయంలో చార్మి ఏం చేస్తుందో ఇంకా వేచి చూడాలి.

Jyothi

Jyothi

Next Story